Home /News /technology /

FLIPKART BIG SAVING DAYS BEGINS KNOW ABOUT BEST SMARTPHONES UNDER RS 10000 SS

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
(image: Flipkart)

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే (image: Flipkart)

Flipkart Big Saving Days Sale 2022 | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఎస్‌బీఐ కార్డుతో (SBI Credit Card) కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days) ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఇప్పటికే ఈ సేల్ ప్రారంభమైంది. మిగతా కస్టమర్లకు ఈ సేల్ మే 3న ప్రారంభం అవుతుంది. మే 8 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone), స్మార్ట్ టీవీ, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్... ఇలా అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. రూ.10,000 లోపు, రూ.15,000 లోపు, రూ.20,000 లోపు, రూ.25,000 లోపు, రూ.30,000 లోపు మోడల్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. మరి రూ.10,000 లోపు ఏ మొబైల్ ఎంత డిస్కౌంట్‌తో లభిస్తుందో తెలుసుకోండి.

SAMSUNG Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.9,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

REDMI 9i Sport: రెడ్‌మీ 9ఐ స్పోర్ట్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,799 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,299. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.7,349 ధరకు సొంతం చేసుకోవచ్చు.

iQoo Z6 4G: 27 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్... భారీ డిస్కౌంట్‌తో ఐకూ జెడ్6 4జీ సేల్

REDMI 10: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.8,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

MOTOROLA g31: మోటోరోలా జీ31 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.9,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Infinix Hot 11 2022: ఇన్ఫీనిక్స్ హాట్ 11 2022 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.8,249 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Infinix Note 11: ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.9,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు... ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్

Realme Narzo 50A: రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.8,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Realme C25Y: రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.9,299 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 50i: రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.6,299 ధరకు సొంతం చేసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Flipkart, Mobile News, Mobiles, Sbi card, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు