Flipkart Big Saving Days 2021 Sale: ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైన బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ ఫోన్లు, ఎలక్ట్రినిక్స్ పై భారీ డిస్కౌంట్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఆ వివరాలు మీ కోసం..

  • Share this:
    ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ఈ రోజు ప్లస్ మెంబర్లకు ప్రారంభమైంది. ఈ రోజు అర్థరాత్రి నుంచి అందరికీ ఈ సేల్ అందుబాటులోకి రానుంది. 29 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ లో పాపులర్ మొబైల్స్, లాప్ టాప్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ లపై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ అందించనున్నారు. ఈ రోజు సేల్ లో ఈ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
    Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్​లో ఫ్లాగ్​షిప్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఐఫోన్​ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్​

    Apple iPhone 12 mini: ఆపిల్ ఐఫోన్ మినీ 64జీబీ ఫోన్ ను ఈ సేల్ లో డిస్కౌంట్ పై రూ.57,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.69,900. ఈ ఫోన్ పై ఎక్సేంజ్ ఆఫర్ రూ.19,250 వరకు లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు అదనంగా మరో పది శాతం తగ్గింపును అందుకోవచ్చు.

    Apple iPhone 12: యాపిల్ ఐఫోన్ 12 64జీబీ ఫోన్ ను సైతం ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 79,900 కాగా ఈ సేల్ లో ఆఫర్ పై కేవలం రూ. 67,999కే కొనుగోలు చేయొచ్చు. ఎక్సేంజ్ పై రూ.19,250 తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీ బ్యాంకు కస్టమర్లకు అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

    Motorola G10 Power: రూ.12,999 విలువైన ఈ పోన్ ను ఈ సేల్ లో కేవలం రూ.9,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీఐ కార్డు వినియోగదారులు 10 శాతం వరకు తగ్గింపు అందుకోవచ్చు.

    Realme 8: ఈ ఫోన్ 4GB+128GB వేరియంట్ ను రూ. 13,999కి ఈ సేల్ లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 16,999. ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. 5000mAh భారీ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ సొంతం.

    Samsung Galaxy Watch Active 2: ఈ సేల్ లో ఈ వాచ్ ను రూ. 14,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ అసలు ధర రూ. 25,900. ఈ వాచ్ సూపర్ ఆల్మోడ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఫుల్ ఛార్జింగ్ చేస్తే 5 రోజుల పాటు బ్యాక్ అప్ ఉంటుంది.

    Nokia Media Streamer: రూ. 2 వేల కన్నా తక్కువ ధరకే లభించే మీడియా స్ట్రీమింగ్ డివైజ్ ఇది. ఈ సేల్ లో ఈ పరికరాన్ని కేవలం రూ. 1,899కే సొంతం చేసుకోవచ్చు.

    Asus Vivobook Gaming Core i5: ఈ గేమింగ్ ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ పరికరం వాస్తవ ధర రూ. 76,990 కాగా డిస్కౌంట్ పై రూ. 52,490కే సొంతం చేసుకోవచ్చు. ఈ లాప్ టాప్ లో 9th జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: