Home /News /technology /

FLIPKART BIG FESITIVAL OFFER ON APPLE IPHONE 12 CAN BE PURCHASED LOW PRICE GH EVK

Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫ‌ర్‌.. రూ.38,699 ధరకే ఐఫోన్‌ 12

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

పండ‌గ సీజ‌న్‌లో ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్రస్తుతం 128GB వేరియంట్ ఐఫోన్ 12 కేవలం రూ. 55,999 ధరవద్దే లభిస్తోంది. 64GB వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. అయితే ఇతర ఆఫర్లతో కలిపి ఐఫోన్‌ 12, 128 GB వేరియంట్‌ను కేవలం రూ.38,699 ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది

ఇంకా చదవండి ...
ఇటీవల యాపిల్ (Apple) సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత గతంలో వచ్చిన ఐఫోన్‌ సిరీస్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్‌ (iPhone)లపై ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్ (Flipkart) పండుగ సీజన్ సందర్భంగా ఐఫోన్‌ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం 128GB వేరియంట్ ఐఫోన్ 12 కేవలం రూ. 55,999 ధరవద్దే లభిస్తోంది. 64GB వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. అయితే ఇతర ఆఫర్లతో కలిపి ఐఫోన్‌ 12, 128 GB వేరియంట్‌ను కేవలం రూ.38,699 ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్.

పండుగ ఆఫ‌ర్లు..
ఆఫర్లు, డిస్కౌంట్లను మినహాయిస్తే, ప్రస్తుతం ఐఫోన్‌ల ప్రాథమిక ధరలే చాలా వరకు తగ్గాయి. కొనుగోలుదారులు మరికొన్ని ఆప్షన్లతో వీటిని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. పండుగ ఆఫర్లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఐఫోన్ 12 డివైజ్‌లకు ఫ్లిప్‌కార్ట్ రూ.15,800 వరకు ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తోంది. అయితే పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, వేరియంట్, కండిషన్ ఆధారంగా ఈ విలువను నిర్ధారిస్తారు. పాత ఫోన్లకు అత్యధిక ఎక్స్ఛేంజ్ విలువ లభించినప్పుడు, కొత్త ఐఫోన్‌ 12ను రూ.40,199 ధరకే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సందర్భంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఫ్లిప్‌కార్ట్‌ 10 శాతం తగ్గింపును (రూ. 1,500 వరకు) అందిస్తోంది.

Google Drive: కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ నుంచి డేటాను గూగుల్ డ్రైవ్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? తెలుసుకోండి..


యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కూడా ఇదే డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌తో ఐఫోన్‌ 12 ధరను రూ.38,699 కి తగ్గించవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా 10 శాతం డిస్కౌంట్‌ (రూ.1000) వరకు పొందవచ్చు.

గతంలోనూ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఐఫోన్ 12 కొనుగోలుపై ఇలాంటి ఆఫర్ అందుబాటులో ఉండేది. దీంతో ఎంతోమంది కొనుగోలుదారులు ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్, డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ లేకుండా కేవలం రూ.54,999 ధర వద్దే ఐఫోన్‌ 12ను కొనుగోలు చేయగలిగారు. అయితే పండుగ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైన ఈ సేల్స్‌ ఆఫర్లు అక్టోబర్ 10 వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లతో కలిపి అతి తక్కువ ధరకే ఐఫోన్‌12ను కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 ను యాపిల్ సంస్థ గత సంవత్సరం లాంచ్ చేసింది. A14 బయోనిక్ చిప్‌సెట్, పవర్‌ఫుల్ ఇంటర్నల్స్ కారణంగా ఇది మంచి సేల్స్ నమోదు చేసింది.
Published by:Sharath Chandra
First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Apple, Flipkart, Flipkart Big Billion Days, Iphone, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు