హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.40 వేలలోపు టాప్ మోడల్స్ ఇవే

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.40 వేలలోపు టాప్ మోడల్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Flipkart Diwali Sale: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్ తాజాగా దీపావళి ఆఫర్లను అనౌన్స్ చేసింది. కొత్తగా ‘బిగ్ దివాలీ సేల్’ పేరుతో మరోసారి ఆఫర్ల సందడి ప్రారంభించింది. ఈ సేల్ నేటి నుంచి, అంటే అక్టోబర్ 19 నుంచి 23వ తేదీ వరకు లైవ్‌లో ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తాజాగా దీపావళి ఆఫర్లను (Big Diwali Sale) అనౌన్స్ చేసింది. కొత్తగా ‘బిగ్ దివాలీ సేల్’ పేరుతో మరోసారి ఆఫర్ల సందడి ప్రారంభించింది. ఈ సేల్ నేటి నుంచి, అంటే అక్టోబర్ 19 నుంచి 23వ తేదీ వరకు లైవ్‌లో ఉంటుంది. ఈ ఆఫర్లలో అనేక రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌బీఐ (SBI) కార్డ్‌ల ద్వారా అదననంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లలో రూ.40వేల రేంజ్‌లో లభిస్తున్న టాప్ బ్రాండ్‌ల ప్రీమియం ఫోన్లు ఏవో చూద్దాం.

భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.25 వేల టీవీ రూ.5,800కే, రూ.300 ఈఎంఐతో కొనండి

* నథింగ్ ఫోన్ 1

స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 778+ 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 4,500mAh బ్యాటరీ ఉంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరా ఉంటుంది. వెనుక భాగంలో 50MP సెన్సార్లతో రియర్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో నథింగ్ ఫోన్ 1 రూ.29,999కు అందుబాటులో ఉంది.

* గూగుల్ పిక్సెల్ 6a

గూగుల్ (Google) కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,410 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ Google Tensor ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 6జీబీ ర్యామ్‌తో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరా ఉంటుంది. బిగ్ దీపావళి సేల్ రెండో ఎడిషన్ సందర్భంగా ఇది రూ.34,199 డిస్కౌంట్ ధర అందుబాటులో ఉంది. ఎస్‌‌బీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా 10శాతం.. అంటే రూ.1250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Amazon: అమెజాన్‌ సేల్‌లో వెస్టింగ్‌హౌస్ స్మార్ట్ టీవీలపై 60% వరకు డిస్కౌంట్.. రూ.5,499కే 32 inches హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ..

* యాపిల్ ఐఫోన్ 12 మినీ

యాపిల్ ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ A14 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈఫోన్‌లో 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ ఉంటుంది. ఇది iOS 14తో రన్ అవుతుంది. అలాగే iOS 16 అప్‌డేట్‌కు సపోర్ట్ ఉంటుంది. ఈ డివైజ్ IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందిస్తుంది. బిగ్ దీపావళి రెండో ఎడిషన్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ పై ఏకంగా 34శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. దీంతో దీన్ని రూ.38,990కు సొంతం చేసుకోవచ్చు.

* శామ్‌సంగ్ గెలాక్సీ F21 FE 5G

గెలాక్సీ F21 FE 5G స్మార్ట్‌ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ ర్యామ్‌తో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. బిగ్ దీపావళి సేల్ సందర్భంగా శామ్‌సంగ్ గెలాక్సీ F21 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం రూ.35,999కు అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌‌‌లో భాగంగా గరిష్టంగా ₹3,000 డిస్కౌంట్ పొందవచ్చు.

First published:

Tags: Business, Flipkart, Flipkart Big Diwali Sale, Technology