Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఐఫోన్ 12, పిక్సెల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

(image: Poco India)

బిగ్‌ దివాళీ సేల్‌లో యాపిల్, షావోమి, శాంసంగ్, పోకో, రియల్ మీ, అలాగే మరిన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్లతో అందుబాటులోకి వచ్చాయి.

  • Share this:
Flipkart Big Diwali Sale: ఇటీవలే పండగ సీజన్‌ సందర్భంగా ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో సేల్‌ తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇప్పుడు మరో సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ‘బిగ్‌ దివాళీ సేల్‌’ పేరిట ఈ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 23 వరకు నడుస్తుంది. ఈ సేల్ ద్వారా యాపిల్, శాంసంగ్, పోకో, ఇంకా ఇతర బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఎస్‌బీఐ కార్డుదారులు అదనపు డిస్కౌంట్‌లను పొందవచ్చు.

బిగ్‌ దివాళీ సేల్‌లో యాపిల్, షావోమి, శాంసంగ్, పోకో, రియల్ మీ, అలాగే మరిన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్లతో అందుబాటులోకి వచ్చాయి. భారీ డిస్కౌంట్ తో రూ. 53,999 ధరకే విక్రయానికి వచ్చిన ఐఫోన్ 12 కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ సమయంలో ఐఫోన్ 12 మినీ మోడల్ ధర ప్రస్తుతం రూ.42,099గా ఉంది. ఐఫోన్ ఎస్ఈ (2020) రూ.30,099 కే లభిస్తోంది.

గూగుల్ పిక్సెల్ 4a అసలు ధర రూ.31,999 కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో అది రూ.25,999 ధరకే లభిస్తోంది. అంతేకాదు, గూగుల్ పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్‌ ప్రొడక్ట్స్ పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ మీరు పిక్సెల్ 4ఎ కొనుగోలు చేస్తే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్‌ను రూ .1 కే సొంతం చేసుకోవచ్చు. పోకో స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన పోకో సీ31 (Poco C31) రూ.8,499 ధరకే అందుబాటులోకి వచ్చింది. పోకో ఎఫ్3 జీటీ 5జీ(Poco F3 GT 5G) ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి డీల్‌లతో రూ.28,999 ధరకే లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో రూ.29,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 ని రూ.18,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ పై 36 శాతం డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి మీరు కూడా దీన్ని ఒకసారి చెక్ చేయండి. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ గల శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ.9,499 ధరకే లభిస్తోంది. క్వాడ్ రియర్ కెమెరాలు, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే గెలాక్సీ ఎఫ్22 ధర రూ. 12,499గా ఉంది. ఒప్పో, అసుస్‌ (Asus) , ఇంఫినిక్స్, మోటోరోలా, వివో కంపెనీలతో పాటు అనేక ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published: