Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ ప్రారంభం.. రూ .15 వేలలోపు బడ్జెట్​ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

Moto G40 Fusion

Flipkart Big Diwali Sale | దీపావళి పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్​ను ప్రారంభించింది. ఈ సేల్ ఈవెంట్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. సేల్​లో భాగంగా స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

  • Share this:
Flipkart Big Diwali Sale : దీపావళి పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale)​ను ప్రారంభించింది. ఈ సేల్ ఈవెంట్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. సేల్​లో భాగంగా స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. డిస్కౌంట్లకు అదనంగా ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ వంటివి అందిస్తోంది. ఈ సేల్​ ద్వారా కేవలం రూ .15 వేల ధరలోపే ఉత్తమ స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయవచ్చు. అవేంటో చూద్దాం.

Motorola Moto G40 Fusion

మోటో G40 ఫ్యూజన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్​తో వస్తుంది. ఇది 6.8 -అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్​ప్లే కలిగి ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్​ దివాళి సేల్​లో దీన్ని కేవలం రూ .13,499 ప్రారంభం ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Apple ID: యాపిల్ యూజర్లకు బంపరాఫర్​.. యాపిల్​ ఐడీ వాడండి.. 20 శాతం బోనస్ పొందండి


Samsung Galaxy F12

శామ్సంగ్​ గెలాక్సీ ఎఫ్​12 స్మార్ట్​ఫోన్​ 6.5- అంగుళాల HD+ ఇన్ఫినిటీ- వీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 4GB ర్యామ్​తో జతచేసిన ఆక్టా-కోర్ ఎక్సినోస్​ 850 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీని బేస్​ వేరియంట్​ రూ. 12,999 వద్ద ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్​లో దీన్ని రూ .9,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Poco M3 Pro 5G

పోకో ఎం 3 ప్రో 5 జి 6.53 -అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని అందించింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్‌లో, పోకో ఎం 3 ప్రో 5 జి రూ .14,499 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

Upcoming Smartphones: ఈ వారం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్


Realme 8i

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్​లో రియల్‌మీ 8i స్మార్ట్​ఫోన్​ను రూ .13,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది మీడియాటెక్ హెలియో G96 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ UI 2.0 లో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Micromax IN Note 1

ఫ్లిప్‌కార్ట్ యూజర్లు మైక్రోమ్యాక్స్ IN నోట్ 1 ని భారీ డిస్కౌంట్​పై కొనుగోలు చేయవచ్చు. మైక్రోమ్యాక్స్ ఇన్​ నోట్1 బేస్​ వేరియంట్​ రూ .9,499 వద్ద లభిస్తుంది. ఇది మీకు క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ మీడియాటెక్ హీలియో జి 85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో మూడు సెన్సార్లతో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది.
Published by:Krishna Adithya
First published: