హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్లపై రూ.25 వేల డిస్కౌంట్.. కొన్ని గంటలే ఈ ఆఫర్!

Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్లపై రూ.25 వేల డిస్కౌంట్.. కొన్ని గంటలే ఈ ఆఫర్!

 Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్లపై రూ.25 వేల డిస్కౌంట్.. కొన్ని గంటలే ఈ ఆఫర్!

Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్లపై రూ.25 వేల డిస్కౌంట్.. కొన్ని గంటలే ఈ ఆఫర్!

Flipkart Sale | కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు ఈ ఒక్క రోజే ఛాన్స్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్లపై అదిరే ఆఫర్లు నేటితో ముగియనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Flipkart Offers | కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఎందుకని అనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్లపై (Smartphones) భారీ తగ్గింపు ఆఫర్లు ఈ రోజుతో ముగియనున్నాయి. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అందిస్తున్న బిగ్ దీపావళి సేల్ ఈ రోజు రాత్రితో ముగుస్తుంది. అక్టోబర్ 23 వరకే ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఫోన్ కొనాలని భావించే వారు ఈ డీల్స్ మిస్ అవ్వొద్దు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 32,999కు కొనొచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 18,500 వరకు తగ్గింపు పొందొచ్చు. బ్యాంక ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్‌ కూడా అందుబాటు ధరకే లభిస్తోంది. దీన్ని రూ. 27,999కు కొనొచ్చు. ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ రూ. 44,000. ఎస్‌బీఐ , ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డులపై అదనపు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.

55 అంగుళాల స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్.. తక్కువ ధరకే లభిస్తున్న టాప్ 10 టీవీలు ఇవే!

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ 5జీ ఫోన్‌ను రూ. 25 వేల డిస్కౌంట్‌తో పొందొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 84,999. అయితే దీన్ని రూ. 59,999కు కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి దీనికి అదనం. అలాగే రియల్‌మి జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. ఏకంగా రూ. 20,999 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అలాగే ఫోన్‌పై రూ.5 వేల తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 25,999కు సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్ కింద రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.

శుభవార్త.. రూ.3 వేలు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 వారాల్లోనే భారీ తగ్గుదల!

అందువల్ల స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కాకుండా అమెజాన్‌లో కూడా ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులో ఉంది. ఇది కూడా నేటితో ముగుస్తుంది. అందువల్ల మీరు ఆఫర్లు పొందాలని భావిస్తే.. వెంటనే త్వరపడాలి. రేపటి నుంచి ఆఫర్లు అందుబాటులో ఉండవు. స్మార్ట్‌ఫోన్స్ లేదంటే వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ ఇలా మీరు ఏది కొనాలన్నా ఇప్పుడే ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. తర్వాత ఈ డిస్కౌంట్లు లభించకపోవచ్చు.

First published:

Tags: Flipkart, Flipkart Big Billion Days, Flipkart Big Diwali Sale, Latest offers, Mobile offers

ఉత్తమ కథలు