ఇండియన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కొత్తగా దీపావళి ఆఫర్లను ప్రారంభించింది. బిగ్ దివాలీ సేల్ పేరుతో మరోసారి ఆఫర్ల జాతరను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నిన్న (అక్టోబర్ 19న) ప్రారంభమైంది. అక్టోబర్ 23 వరకు కొనసాగే ఈ స్పెషల్ ఆఫర్లలో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను (Budget Smartphone) తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ దీపావళికి (Diwali 2022) కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. రూ.15వేల నుంచి రూ.20 వేల రేంజ్లో లభిస్తున్న బెస్ట్ మోడల్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్లు ఏవో చూద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ F23 5G
గెలాక్సీ F23 5G ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్‌లో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.13,999కే అందుబాటులో ఉంది. 4GB RAM వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ డివైజ్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
పోకో X4 ప్రో 5G
ఈ స్మార్ట్‌ఫోన్ AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, ఇతర స్పెసిఫికేషన్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజా సేల్‌లో పోకో X4 ప్రో 5G ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.16,999గా ఉంది. 6GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.15,499కు లభిస్తోంది.
రెడ్మీ నోట్ 11 SE
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G95 చిప్సెట్తో పనిచేస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో బెస్ట్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. రెడ్మీ నోట్ 11 SE 6GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ తాజా సేల్‌లో రూ. 11,499కే అందుబాటులో ఉంటుంది.
రియల్మీ 9i
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్‌తో, 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో లాంచ్ అయింది. దీంట్లోని 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలు బెస్ట్ క్వాలిటీ స్నాప్స్ క్యాప్చర్ చేస్తాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్తో పనిచేస్తుంది. రియల్మీ 9i డివైజ్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తాజా సేల్‌లో రూ.16,999కే లభిస్తుంది. ఈ ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.
రియల్మీ 9 5G
ఇది బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్. ఫుల్ HD+ డిస్ప్లేతో వచ్చే ఈ డివైజ్, ట్రిపుల్ కెమెరా లెన్స్‌తో క్వాలిటీ కెమెరాలతో వస్తుంది. దీంట్లో 48MP ప్రైమరీ రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. రియల్మీ 9 5G ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు.
Vivo T1
వివో T1 స్మార్ట్‌ఫోన్‌లో బడ్జెట్ ధరలోనే బెస్ట్ కెమెరాలు ఉంటాయి. 50 MP ప్రైమరీ రియర్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరాతో వచ్చే ఈ డివైజ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్తో పనిచేస్తుంది. బిగ్ దివాలీ సేల్‌లో వివో T1 ఫోన్ 4GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు.
- బిగ్ దివాలీ సేల్‌లో SBI కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేసేవారికి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు, EMI ఆప్షన్లను సెలక్ట్ చేసుకున్న వారు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Diwali 2022, Flipkart, Flipkart Big Diwali Sale, Smartphones