హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

POCO C3: దీపావళి ఆఫర్.. రూ. 6,999కే 4 GB+ 64 GB స్మార్ట్ ఫోన్

POCO C3: దీపావళి ఆఫర్.. రూ. 6,999కే 4 GB+ 64 GB స్మార్ట్ ఫోన్

Poco C3:

Poco C3:

POCO C3: 7వేల లోపు మొబైల్ కొనాలనుకునే వారికి పోకో సీ3 (POCO C3) రూపంలో అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఎమ్మార్పీ 10,999 రూపాయలున్న POCO C3(4 GB RAM + 64 GB) ఫోన్‌ను బిగ్ బిలియన్ డేస్‌లో రూ.6,999కే అందిస్తోంది.

  దసరాకు ముందు బిగ్ బిలియన్ డేస్ పేరిట సేల్ నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు దీపావళికి ముందు కూడా బిగ్ దివాలి సేల్ నిర్వహిస్తోంది. ఈసారి కూడా అద్భుతమై ఆఫర్లను అందిస్తోంది. అక్టోబరు 29 నుంచి నవంబరు 4 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కిచెన్ వస్తువుల నుంచి దుస్తుల వరకు.. స్క్రీన్ గార్డ్ మొదలుకొని హైఎండ్ మొబైల్స్ వరకు అన్నీ తక్కువ ధరకే దొరుకుతున్నాయి. దీపావళి పండగ వేళ ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తున్నారు. 7వేల లోపు మొబైల్ కొనాలనుకునే వారికి పోకో సీ3 (POCO C3) రూపంలో అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఎమ్మార్పీ 10,999 రూపాయలున్న POCO C3(4 GB RAM + 64 GB) ఫోన్‌ను బిగ్ బిలియన్ డేస్‌లో రూ.6,999కే అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ధరకు లభిస్తోంది.

  ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో నడిచే ఈ ఫోన్‌లో.. వెనక వైపు మూడు కెమెరాలు, ముందువైపు సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5O00 బ్యాటరీ సామర్థ్యంతో పోకో సీ3 మార్కెట్లోకి ఇటీవల విడుదలయింది. భారీ స్క్రీన్, పెద్ద బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ అందుబాటు ధరలోనే దొరుకుతోంది.

  పోకో సీ3 స్పెసిఫికేషన్స్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12

  డిస్‌ప్లే: 6.53 అంగుళాల హెచ్‌డీ

  ర్యామ్: 3జీబీ, 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35

  రియర్ కెమెరా: 13+2+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్

  కలర్స్: ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్, మ్యాటీ బ్లాక్

  ధర: 4జీబీ+64జీబీ- రూ.8,999 (ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.6,999)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Flipkart, Flipkart Big Diwali Sale, POCO India, Technology

  ఉత్తమ కథలు