Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డబుల్ డిస్కౌంట్

Flipkart Big Diwali Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్ డబుల్ డిస్కౌంట్‌తో రూ.12,500 ధరకే సొంతం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: October 11, 2019, 5:13 PM IST
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డబుల్ డిస్కౌంట్
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డబుల్ డిస్కౌంట్ (image: Flipkart)
news18-telugu
Updated: October 11, 2019, 5:13 PM IST
దసరా ముగియగానే మళ్లీ ఆన్‌లైన్ సేల్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 12 నుంచి 16 వరకు బిగ్ దివాళీ సేల్ జరగబోతోంది. ప్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 11 రాత్రి 8 గంటలకే సేల్ ప్రారంభం కానుంది. దసరాకు ముందు జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్ కన్నా... బిగ్ దివాళీ సేల్ ప్రత్యేకం కానుంది. స్మార్ట్‌ఫోన్లపై డబుల్ డిస్కౌంట్ లభించనుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేసేవారికి 10% డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అన్ని కార్డులపై అదనంగా 10% డిస్కౌంట్ (రూ.1,000 వరకు) ప్రకటించింది. అంటే... ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో స్మార్ట్‌ఫోన్ కొంటే డబుల్ డిస్కౌంట్ పొందొచ్చు. ఉదాహరణకు రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు ప్రీపెయిడ్ పేమెంట్ కాబట్టి రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్ డబుల్ డిస్కౌంట్‌తో రూ.12,500 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read this: Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

Flipkart Big Diwali Sale, Flipkart Big Diwali Sale double discount, Flipkart Big Diwali Sale extra discount, Flipkart Big Diwali Sale smartphone offers, Flipkart Big Diwali Days sale SBI offers, Flipkart Big Diwali sale discounts, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ 2019, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ డబుల్ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ డిస్కౌంట్స్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ ఎస్‌బీఐ ఆఫర్స్
image: Flipkart


ఈ ఆఫర్ కొన్ని స్మార్ట్‌ఫోన్లపై మాత్రమే. రెడ్‌మీ నోట్ 7 ప్రో, రియల్‌మీ 5, వివో జెడ్1 ప్రో, రెడ్‌మీ నోట్ 7ఎస్, రియల్‌మీ సీ2 లాంటి స్మార్ట్‌ఫోన్లను డబుల్ డిస్కౌంట్‌తో పొందొచ్చు. ఇక ఈ ఆఫర్లతో పాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్లపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఒక్క రూపాయికే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ లాంటి ఆఫర్లున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు. టీవీలు, అప్లయెన్సెస్‌‌పై 75% వరకు, ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై 50-80% వరకు, ఫర్నీచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మహా ప్రైస్ డ్రాప్‌ సేల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై అదనంగా 15% డిస్కౌంట్, మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై రోజు అర్థరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు ధమాకా డీల్స్, రష్ హవర్స్‌లో అర్థరాత్రి 12 నుంచి 2 గంటల వరకు అదనపు డిస్కౌంట్స్ అందించనుంది.



తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:
Loading...
Amazon Sale: అమెజాన్‌లో మళ్లీ ఫెస్టివల్ సేల్... ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో

SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా
First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...