Home /News /technology /

FLIPKART BIG DIWALI SALE 2021 UP TO RS 4000 DISCOUNT ON THESE 15 SMARTPHONES FROM SAMSUNG REALME MOTOROLA AND OTHER BRANDS SS

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్
(image: Flipkart)

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్ (image: Flipkart)

Flipkart Big Diwali Sale 2021 | మరో రెండు రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో (Flipkart Big Diwali Sale) స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఏఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత వరకు డిస్కౌంట్ పొందొచ్చో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ముగిసింది. ఈ సేల్ ముగియగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 23 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే సేల్ మొదలవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ డిస్కౌంట్‌తో పాటు ఎస్‌బీఐ కార్డుతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఏ స్మార్ట్‌ఫోన్లపై ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

    Realme Narzo 50A: రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. ప్రీపెయిడ్ లేదా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.

    Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. ఆఫర్ ధర రూ.15,999. డిస్కౌంట్ రూ.500 లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఆఫర్‌లో రూ.15,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

    Realme GT Neo 2 vs iQOO 7: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

    MOTOROLA Edge 20 Fusion: మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.21,499 కాగా ఆఫర్ ధర రూ.20,499. డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్‌తో రూ.20,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.

    Realme C25Y: రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.10,999. ప్రీపెయిడ్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

    Poco F3 GT 5G: పోకో ఎఫ్‌3 జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.28,999. ఆఫర్ ధర రూ.25,999. డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

    Banned Apps: మరిన్ని యాప్స్ బ్యాన్ చేసిన గూగుల్... ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా?

    Realme C21Y: రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.8,999. ప్రీపెయిడ్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

    Realme GT Master Edition: రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 ఎక్స్‌ఛేంజ్, ప్రీపెయిడ్ డిస్కౌంట్ లభిస్తుంది.

    Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్‌గా రిలీజ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. లాంఛ్ ఆఫర్స్‌లో భాగంగా ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.24,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.28,999 ధరకు లభిస్తుంది.

    Passwords: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చు... తేల్చి చెప్పిన మొజిల్లా ఫౌండేషన్

    Poco X3 Pro: పోకో ఎక్స్‌3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్‌లో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.16,999 ధరకు, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.18,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

    Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధర రూ.12,999. ఎస్‌బీఐ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

    Poco M3: పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. బేస్ వేరియంట్‌ను రూ.10,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

    Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

    Samsung F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.20,999 కాగా ఆఫర్ ధర రూ.17,999. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ వర్తిస్తుంది.

    Realme Narzo 50i: రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.7,499 కాగా ఆఫర్ ధర రూ.6,499. ఎస్‌బీఐ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

    Realme 8i: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999. ప్రీపెయిడ్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది.

    Realme 8s 5G: రియల్‌మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.19,999. ప్రీపెయిడ్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.1,500 లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Flipkart, Flipkart Big Diwali Sale, Moto, Motorola, POCO, POCO India, Realme, Realme Narzo, Realme UI, Samsung

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు