Home /News /technology /

FLIPKART BIG DIWALI SALE 2021 BEST DEALS ON CHROMEBOOKS WIRELESS EARPHONES SMARTWATCHES GH VB

Flipkart Big Diwali Sale 2021: దివాళి సేల్​లో బంపరాఫర్లు.. తెలిస్తే పండగ చేసుకోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్ కార్డ్ దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. క్రోమ్ బుక్స్, వైర్ లెస్ ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. నిన్న (అక్టోబర్​ 17న) ప్రారంభమైన దీపావళి బిగ్ సేల్​ అక్టోబర్​ 23 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇంకా చదవండి ...
ఈ–కామర్స్​దిగ్గజం ఫ్లిప్ కార్డ్ దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. క్రోమ్ బుక్స్, వైర్ లెస్ ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.నిన్న (అక్టోబర్​ 17న) ప్రారంభమైన దీపావళి బిగ్ సేల్​ అక్టోబర్​ 23 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్​లో హెచ్ పి, ఆసుస్, యాపిల్, నాద్, ఫోసిల్, శ్యాంసంగ్ కంపెనీల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందిస్తోంది. వీటికి అదనంగా బ్యాంకు ఆఫర్లు కూడా ప్రకటించింది.

Flipkart: సీరియల్ నటుడికి షాక్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. అతడికి ఏమి వచ్చిందో తెలుసా..


క్రోమ్​బుక్​లపై భారీ డిస్కౌంట్
హెచ్ పి 14ఎ సెలెరాన్ డ్యూయల్ కోర్క్రోమ్ బుక్ ఫ్లిప్ కార్ట్​లోరూ.26,990 ధర వద్దఅందుబాటులో ఉంది.ఎస్​బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసేవారికి రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్​లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 14 అంగుళాలక్రోమ్ బుక్​లపై ఆఫర్​ అందిస్తోంది. ఈ సెల్ రాన్ డ్యూయల్ కోర్ఆసుస్ క్రోమ్ బుక్ రూ.21,499తో అందుబాటులో ఉంది. ఇందులో డ్యూరల్ స్పీకర్లు, 15.6 యాంటీ గ్లేర్ డిస్ ప్లే, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, యుఎస్​బీ సీ ఛార్జింగ్ వంటి సౌకర్యాలను అందించింది. ఇది4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరీజీతో వస్తుంది.

వైర్ లెస్ ఇయర్ ఫోన్లపై ఆఫర్లు
ఛార్జింగ్ కేస్ తో ఆపిల్ ఎయిర్ పాడ్స్ రూ.8999కే అందుబాటులో ఉంచారు. ఎస్​బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రూ.900 డిస్కౌంట్ లభిస్తుంది. దీని ధర మార్కెట్లో రూ.14,900గా ఉంది. నథింగ్ ఇయర్ వన్ ఇయర్ బడ్​​రూ.5,499లకే లభిస్తుంది.ఎస్​బీఐ కార్డు ద్వారా వీటిని కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. వీటికి వైర్ లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

WhatsApp Features: త్వరలోనే వాట్సాప్​లో మరిన్ని కొత్త ఫీచర్లు.. ఇక ప్రత్యర్థి యాప్స్​కు చుక్కలే..


స్మార్ట్ వాచ్ డీల్స్
పాసిల్ జెన్ 5 వాచ్ ఫిప్ కార్ట్ లో రూ.15,995కే అందిస్తున్నారు. ఎస్ బీ ఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. 3.2 సెం.మీ అమోలెడ్ డిస్ ప్లే, 1 జీబీ ర్యామ్, 8 బీజీ స్టోరేజ్ సౌకర్యాలు ఉన్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్, గూగుల్ వేర్ ఓఎస్ సిస్టమ్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు యాక్సెస్ చేయవచ్చు.

ఫిట్ నెస్ కు సంబంధించిన అన్నింటిని ట్రాక్ చేయవచ్చు. ఇక, శామ్​సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 రూ.11990 ధర వద్దేలభిస్తుంది.ఎస్​బీఐక్రెడిట్ కార్డు ద్వారా రూ.1299 డిస్కౌంట్ పొందవచ్చు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. లేత గోదుమరంగు, నలుపు, బూడిద రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Flipkart

తదుపరి వార్తలు