ఆన్లైన్ షాపింగ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ సేల్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్రచారం చేస్తున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ టీజర్ వచ్చేసింది. ప్రతీ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తూ ఉంటుంది ఫ్లిప్‌కార్ట్. ఈసారి కూడా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ సేల్ నిర్వహించనుంది. అయితే త్వరలో సేల్ ఉంటుందని మాత్రమే ప్రకటించింది. కానీ తేదీలను ఇంకా వెల్లడించలేదు. ఈ సేల్‌లో డిస్కౌంట్లు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ ఎంతవరకు పొందొచ్చో ఇంకా వెల్లడించలేదు. ఇక పేటీఎం నుంచి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకులతో పాటు బజాజ్ ఫిన్సర్వ్ నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అంటే ఈ కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డుతో కొనేవారు కూడా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఎర్లీ పాస్ ప్రకటించింది ప్లిప్‌కార్ట్. అంటే ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్‌ని మిగతా కస్టమర్ల కన్నా ముందే పొందొచ్చు.
Realme Narzo 20: కాసేపట్లో రియల్మీ నార్జో 20 సేల్... ఆఫర్స్ ఇవే
JioPostpaid Plus: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్స్ మీకోసమే
ఇక ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించనుంది ఫ్లిప్‌కార్ట్. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు ఎస్బీఐ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మొబైల్స్ కొనేవారికి నో కాస్ట్ ఈఎంఐ, ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఉంటాయి. ఇక టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై 80శాతం వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. నో కాస్ట్ ఈఎంఐ, కంప్లీట్ అప్లయెన్స్ ప్రొటెక్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఇక ఫ్యాషన్ వేర్‌పై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యూటీ, ఫుడ్, టాయ్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్ రూ.79 నుంచి ప్రారంభమౌతాయి. హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ రూ.49 నుంచి మొదలవుతాయి. ఫర్నీచర్‌పై 50 నుంచి 80 శాతం తగ్గింపు పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్లపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవి కాకుండా మహా డ్రాప్, క్రేజీ డీల్స్, రష్ హవర్స్ లాంటి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సూపర్ కాయిన్స్ కలెక్ట్ చేసేవారు కాయిన్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. బోనస్ కాయిన్స్ గెలుచుకోవచ్చు.
Amazon Fire TV Stick: టీవీని స్మార్ట్‌గా మార్చే అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్స్... ధర రూ.2,999 నుంచి
Non-Chinese Smartphones: రూ.10,000 లోపు రిలీజైన 5 నాన్ చైనీస్ స్మార్ట్ఫోన్లు ఇవే
ఇక ఇప్పటికే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెజాన్ కూడా సేల్ ఎప్పుడు నిర్వహించనుందో తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దసరా, దీపావళి సీజన్లోనే జరగనున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:September 28, 2020, 12:08 IST