హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Billion Days: త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. తక్కువ ధరకే లభించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌ ఇవే..

Big Billion Days: త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. తక్కువ ధరకే లభించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌ ఇవే..

కంపెనీ యాడ్

కంపెనీ యాడ్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫిప్‌కార్ట్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. స్మార్ట్‌ఫోన్స్ మొదలుకొని ల్యాప్‌ టాప్స్, టెలివిజన్స్, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌండ్‌ను ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫిప్‌కార్ట్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. స్మార్ట్‌ఫోన్స్ మొదలుకొని ల్యాప్‌ టాప్స్, టెలివిజన్స్, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌండ్‌ను ప్రకటించింది. ఒప్పొ, రియల్‌మీ, మోటోరోలా, ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్స్‌కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవవచ్చు. ఆఫర్స్‌లో అందుబాటులో ఉన్న మోడళ్లపై ఓ లుక్కేద్దాం.

* ఏకంగా 80 శాతం డిస్కౌంట్

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు వంటివి మరెన్నో ఉన్నాయి. అలాగే టీవీ, ఇతర ఎలక్ట్రికల్ డివైజ్‌లపై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అలాగే గృహోపకరణాలు, లైఫ్‌స్టైల్ ప్రాడక్ట్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్, టాయ్స్, ఫర్నిచర్ వంటి వస్తువులను కూడా డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.

** స్మార్ట్‌ఫోన్ల ఆఫర్లు

* మోటోరోలా ఎడ్జ్ 30

ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 22శాతం డిస్కౌంట్‌తో దీన్ని రూ.22,749కు కొనుగోలు చేయవచ్చు. కాగా, ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.30,999. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 6,55-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది.

* రియల్‌మీ 9 ప్రో

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.14,999కు లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా దీన్ని రూ.12,999కు సొంతం చేసుకోవచ్చు. ఇదే కంపెనీకి చెందిన మరో మోడల్ రియల్‌మీ జీటీ 2 ప్రో మోడల్‌ను డిస్కౌంట్‌లో భాగంగా రూ.26,999కు కొనుగోలు చేయవచ్చు.

* ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ

ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 40శాతం డిస్కౌంట్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ ప్రస్తుతం ధర రూ.24,999 కాగా, బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో దీన్ని రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్షిటి 8105G ప్రాసెసర్‌‌తో రన్ అవుతుంది. ఇందులో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. ఇందులో 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది.

* ఒప్పొ రెనో8 5జీ

బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. దీని ధర రూ.38,999 కాగా, దీనిపై 23శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో రూ.26,999కు ఒప్పో రెనో8 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

కాగా, బిగ్ బిలియన్ డేస్ సేల్ ఏ తేదీల్లో నిర్వహించనుందో ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించలేదు. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్స్పై డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే మరికొన్ని రోజులు వేచిఉండాల్సిందే. అయితే తాజా సేల్ కోసం ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంకులతో ఫ్లిప్‌కార్ట్ టైఅప్ అయింది. ఈ బ్యాంకుల సంబంధించిన కార్డులు ఉంటే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను సందర్భంగా ప్రతి రూ.1500 కొనుగోళ్లపై అదనంగా 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Published by:Paresh Inamdar
First published:

Tags: BUSINESS NEWS, Flipkart Big Billion Days, Oppo, Smart phone

ఉత్తమ కథలు