హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Billion Days: ఆఫర్లే ఆఫర్లు.. సగం ధరకే టీవీలు, ఏసీలు.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు!

Big Billion Days: ఆఫర్లే ఆఫర్లు.. సగం ధరకే టీవీలు, ఏసీలు.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు!

ఆఫర్లే ఆఫర్లు.. సగం ధరకే టీవీలు, ఏసీలు.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు!

ఆఫర్లే ఆఫర్లు.. సగం ధరకే టీవీలు, ఏసీలు.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు!

Flipkart Offers | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తీసుకువస్తోంది. ఇందులో భాగంగా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. టీవీల నుంచి వాషింగ్ మెషీన్ల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Flipkart Sale | షాపింగ్ చేయడానికి రెడీ అవుతున్నారా? ఇంట్లోకి ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ఏసీ వంటివి కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సూపర్ సేల్‌తో కస్టమర్ల ముందుకు రాబోతోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో (Flipkart Big Billion Days) కొనుగోలుదారులను పలకరించబోతోంది. కేవలం స్మార్ట్‌ఫోన్స్ (Smartphone)మాత్రమే కాకుండా హోమ్ అప్లయెన్సెస్‌పై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంచనుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీలపై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉండనుంది. అలాగే వాషింగ్ మెషీన్లపై కూడా కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లపై 55 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా కన్వర్టిబుల్ ఏసీలపై కూడా 50 శాతం తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా స్మార్ట్ రిఫ్రిజిరేట్లపై 55 శాతం డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.

డబ్బు సంపాదించాలనుకునే వారికి అద్భుత అవకాశం.. సెప్టెంబర్ 14న మిస్ అవ్వొద్దు!

అలాగే ఇతర హోమ్ అప్లయెన్సెస్‌పై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. కిచెన్ అప్లయెన్సెస్‌పై అయితే 75 శాతం తగ్గింపు పొందొచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససిరీస్‌పై అయితే ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ట్రిమ్మర్లపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఫ్యాషన్, బ్యూటీ, టాయ్స్ వంటి ఇతరత్రా వాటిపై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. ఫర్నీచర్ అండ్ మ్యాట్రసెస్‌పై అయితే 85 శాతం వరకు డిస్కౌంట్ ఉండొచ్చు.

Bank అకౌంట్ ఉన్న వారికి అలర్ట్.. ఈ 7 రకాల సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిందే!

ఇవేకాకుండా ఇంకా క్రేజీ డీల్స్, టిక్ టాక్ డీల్స్, రష్ అవర్స్ వంటి ఆఫర్లు కూడా ఉంటాయి. అలాగే మూడు కొంటే అదనంగా 5 శాతం తగ్గింపు, రెండు కొంటే అదనంగా 5 శాతం డిస్కౌంట్, ఐదు కొంటే అదనంగా 10 శాతం తగ్గింపు వంటి ఆఫర్లు కూడా పొందొచ్చు. మెడిసిన్స్‌పై కూడా భారీ తగ్గింపు లభించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ కస్టమర్లు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఏమైనా కొనుగోలు చేయాలని భావిస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయడానికి రెడీగా ఉండండి. త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను సంస్థ ప్రకటించనుంది. ఇకపోతే ఆఫర్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ధరలను ఇతర ఈకామర్స్ సైట్లలలో చెక్ చేసుకోండి. అప్పుడు మీరు నిజంగా ఎంత డిస్కౌంట్ రేటుకు ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తున్నారో తెలుసుకోవచ్చు.

First published:

Tags: Flipkart, Flipkart Big Billion Days, Flipkart Big Diwali Sale, Latest offers, Offers

ఉత్తమ కథలు