హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Billion Days Sale: అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్స్ ఇవే

Flipkart Big Billion Days Sale: అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్స్ ఇవే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Flipkart Big Billion Days Sale 2020 | కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఓ 10 రోజులు ఆగండి. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాబోతోంది.

  ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 ఎప్పుడో తెలిసిపోయింది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఆరు రోజుల పాటు ఏడాదిలోనే భారీ సేల్ నిర్వహించబోతోంది. ఫ్లిప్‌కార్ట్. దసరా, దీపావళి పండుగ సీజన్ కన్నా ముందు నిర్వహించే ఈ సేల్‌లో భారీ ఆఫర్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు, కొత్త స్మార్ట్‌ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ లాంటి ప్రొడక్ట్స్ కొనాలనుకునేవారు ఈ సేల్ కోసం ఎదురుచూస్తుంటారు. కొద్ది రోజులుగా టీజర్లతో ఊరిస్తున్న ఫ్లిప్‌కార్ట్... ఇప్పుడు తేదీలను ప్రకటించింది. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి స్టార్స్‌తో భారీగా ప్రచారం చేస్తోంది. దీంతో పాటు డీల్స్ గురించి ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది.

  ఈసారి ఫ్లిప్‌కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనేవారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ డిస్కౌంట్‌తో పాటు ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేవారికి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక ఈ సేల్‌లో ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ లాంటి అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్ ఉంటాయి.

  ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు బిగ్ బిలియన్ డేస్ డీల్స్ ఒకరోజు ముందుగానే లభిస్తాయి. అంటే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ సేల్ అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఉంటుంది.

  బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ 50,000 పైగా కిరాణా స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 850 నగరాలు, పట్టణాల్లో కస్టమర్లకు ప్రొడక్ట్స్ డెలివరీ చేయనుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Flipkart, Flipkart Big Billion Days, Smartphone

  ఉత్తమ కథలు