హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Billion Days Sale: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ ఫోన్ పై రూ.4 వేల తగ్గింపు.. వివరాలివే

Flipkart Big Billion Days Sale: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ ఫోన్ పై రూ.4 వేల తగ్గింపు.. వివరాలివే

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఈ నెల 23వ తేదీన ప్రారంభమై.. 30వ తేదీ వరకు కొనసాగనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఈ నెల 23వ తేదీన ప్రారంభమై.. 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ కు సంబంధించిన అనేక ఆఫర్ల వివరాలను ఇప్పటికే వెల్లడించింది ఫ్లిప్ కార్ట్. స్మార్ట్ ఫోన్లు (Smartphones), స్మార్ట్ టీవీలు (SmartTVs), ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంకా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మాత్రం ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. బడ్జెట్ ధరలో కొనాలనుకుంటున్న వారికి ఇంకా బెస్ట్ ఛాయిస్ లు అందుబాటులోకి రానున్నాయి. Realme C30S స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ లో చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9999 కాగా.. ఈ సేల్ లో రూ.6250కే అందుబాటులో ఉండనుంది.

  ఈ వివరాలను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే సేల్స్ పేజీలో ప్రకటించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. 2 జీబీ ర్యామ్ తో పాటు 32 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఇంకా 6.5 అంగుళాల భారీ HD+ డిస్ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్లో 8MP Rear కెమెరా ఉంటుంది. ఇంకా 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్లో 5000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులోఉండనుంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.6 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు.

  Flipkart Smart TV Offer: ఈ ఆఫర్లేంట్రా బాబూ.. ప్రముఖ స్మార్ట్ టీవీ మోడల్ పై రూ.43వేల భారీ తగ్గింపు.. కేవలం రూ.14 వేలకే..

  ఇదిలా ఉంటే.. ఈ సేల్ లో టీసీఎల్ కంపెనీకి చెందిన రెండు టీవీలపై భారీ తగ్గింపు లభిస్తోంది. సాధారణంగా వీటి ధర రూ.లక్షకు పైగానే ఉంది. అయితే సేల్‌లో భాగంగా మీరు ఈ టీవీలను రూ.30 వేల నుంచి కొనుగోలు చేయొచ్చు. అంటే భారీ తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. కంపెనీకి చెందిన 55 అంగుళాల 4కే యూహెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్‌ఈడీ టీవీపై సూపర్ తగ్గింపు లభిస్తోంది.

  ఈ టీవీ అసలు ధర రూ. 1,29,990. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ టీవీని రూ. 39,990కే కొనుగోలు చేయొచ్చు. అలాగే టీసీఎల్ 50 అంగుళాల 4కే యూహెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీపై కూడా కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీని బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌లో భాగంగా రూ. 30,990కు కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీ అసలు రేటు రూ. 1,09,990. అంటే ఈ టీవీపై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవాలి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Flipkart, Flipkart Big Billion Days, Smart phones

  ఉత్తమ కథలు