హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్ కార్ట్ సేల్ లో బిగ్గెస్ట్ డీల్ ఇదే.. కేవలం రూ.599కే స్మార్ట్ ఫోన్.. ఆఫర్ రేపటి వరకే

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్ కార్ట్ సేల్ లో బిగ్గెస్ట్ డీల్ ఇదే.. కేవలం రూ.599కే స్మార్ట్ ఫోన్.. ఆఫర్ రేపటి వరకే

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కొనే వారికి ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవాలి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సేల్ లో స్మార్ట్ ఫోన్లపై (Smartphones) భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కొనే వారికి ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా భారీ తగ్గింపుతో అనేక ప్రముఖ కంపెనీలకు చెందిన ఫోన్లు రూ.10 వేలలోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. POCO C31 ఫోన్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫైన్ పై రూ.4500 తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా.. 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ ఫోన్ ను రూ.4500 డిస్కౌంట్ తో రూ.6499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ఐసీఐసీఐ(ICICI), యాక్సిస్ బ్యాంక్ కార్డులతో (Axis Bank Card) కొనుగోలు చేస్తే తక్షణం 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసినా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.5900 వరకు తగ్గింపు అందుకోవచ్చు.

  మీ పాత ఫోన్ మోడల్ కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. మీకు రూ.5900 పూర్తి తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు రూ.599కే కొత్త స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చన్నమాట. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ సారి పరిశీలిస్తే 3 జీబీ ర్యామ్ ఉంటుంది.

  TV Offer: టీవీ కొంటే రూ.22 వేల స్మార్ట్‌ఫోన్ ఫ్రీ! వాషింగ్ మెషీన్లు, ఏసీ, ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు!

  32 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. మెమోరీని 512 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. 16.59 అంగుళాల HD+డిస్ప్లే ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్లో లో 13MP + 2MP + 2MP కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే 5000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఫోన్లో MediaTek Helio G35 ప్రాసెసర్ ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  ఉత్తమ కథలు