హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Best Offer: రేపే దేశంలో 5G లాంఛ్.. ఈ 5G ఫోన్ పై ఏకంగా రూ.10 వేలకు పైగా తగ్గింపు.. ఆఫర్ మరికొన్ని గంటలే..

Flipkart Best Offer: రేపే దేశంలో 5G లాంఛ్.. ఈ 5G ఫోన్ పై ఏకంగా రూ.10 వేలకు పైగా తగ్గింపు.. ఆఫర్ మరికొన్ని గంటలే..

ప్రతీకాత్మక చిత్రం
(image: Oppo India)

ప్రతీకాత్మక చిత్రం (image: Oppo India)

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ నెల 23న బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సేల్ లో భారీ ఆఫర్లను వినియోగదారులకు అందించింది ఫ్లిప్ కార్ట్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఈ నెల 23న బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సేల్ లో భారీ ఆఫర్లను వినియోగదారులకు అందించింది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై కనీవినీ ఎరగని ఆఫర్లను ప్రకటించడంతో ప్రజలకు కొనుగోళ్లకు ఎగబడ్డారు. అయితే.. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఏకంగా పది వేల కన్నా ఎక్కువ తగ్గింపులు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కొనాలని, ముఖ్యంగా 5G ఫోన్ (5G Smartphone) ను కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ సూపర్ ఛాన్స్ గా చెప్పొచ్చు. OPPO K10 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.25,999. కాగా ఈ ఫోన్ పై 38% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే రూ.10 వేల తగ్గింపు ఉంది. దీంతో ఎవరైనా ఈ ఫోన్ ను రూ.10 వేల తగ్గింపుతో రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే రూ.1250 అదనపు తగ్గింపు అందుకోవచ్చు.

    ఇంకా ఈ టీవీపై రూ.15 వేల ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ మోడల్ కండిషన్ బాగుంటే ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. మీరు కేవలం రూ.999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 8GB ర్యామ్+128GB స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 6.56 అంగుళాల హెచ్డీ+డిస్ప్లే ఉంటుంది. 48MP + 2MP కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఇంకా సెల్ఫీల కోసం 8MP ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. ఇంకా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

    Flipkart Big Billion Days Sale: రూ.8 వేలకే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ఈ బంపరాఫర్ రేపటి వరకే.. ఓ లుక్కేయండి

    ఇదిలా ఉంటే.. POCO C31 ఫోన్ పై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫైన్ పై రూ.4500 తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా.. 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ ఫోన్ ను రూ.4500 డిస్కౌంట్ తో రూ.6499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ఐసీఐసీఐ(ICICI), యాక్సిస్ బ్యాంక్ కార్డులతో (Axis Bank Card) కొనుగోలు చేస్తే తక్షణం 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసినా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.5900 వరకు తగ్గింపు అందుకోవచ్చు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Oppo, Smartphone

    ఉత్తమ కథలు