హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Billion Days: వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్ హోరెత్తించే ఆఫర్లు!

Big Billion Days: వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్ హోరెత్తించే ఆఫర్లు!

వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్ హోరెత్తించే ఆఫర్లు!

వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్ హోరెత్తించే ఆఫర్లు!

Flipkart Sale | వివో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. వివో ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్‌ను ఆకర్షణీ డీల్‌కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఈ ఆఫర్లు పొందొచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Flipkart Offers | దిగ్గజ ఈకామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ పండుగ సేల్ ప్టార్ట్ అవుతోంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లపై (Smartphones) కూడా సూపర్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీరు వివో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకోసం అదిరిపోయే డీల్స్ అందుబాటులో న్నాయి. ఏ ఏ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.

    వివో టీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వివో టీ1ఎక్స్ ఫోన్‌ను రూ. 9999కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్ కూపన్ ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు రూ. 1000 తగ్గింపు వస్తుంది. అలాగే వివో టీ1 5జీ ఫోన్‌ను రూ. 13,999కు కొనొచ్చు. కంపెనీ ఇటీవలనే వివో టీ1 5జీ స్పెషల్ ఫెస్టివ్ ఎడిషన్ తెచ్చింది. ఈ వేరియంట్‌ను రూ. 14,999కు కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు అదనంగా రూ. 1000 పొందొచ్చు.

    ఉద్యోగులకు దసరా బొనాంజా.. ఈసారి జీతం ఎంత పెరగొచ్చంటే?

    వివో టీ1 ప్రో ఫోన్ ఆఫర్ ప్రైస్ రూ. 17,999గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలుదారులు ప్రిపెయిడ్ ఆర్డర్‌పై రూ. 4 వేల తగ్గింపు పొందొచ్చు. అలాగే కంపెనీ రూ. 2 వేల అదనపు తగ్గింపు అందిస్తోంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీన్ని కూడా కలుపుకుంటే అప్పుడు ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకే వస్తుంది.

    బైక్, స్కూటర్ కొనేందుకు చౌక వడ్డీకే రుణాలు ఇస్తున్న 20 బ్యాంకులు ఇవే!

    వివో టీ1 44డబ్ల్యూ ఫోన్ ఆఫర్ ధర రూ. 12,499గా ఉంది. ఈ ఫోన్‌పై ఫ్లాట్‌ రూ.1000 తగ్గింపు వస్తోంది. అలాగే అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు రూ. 1000 తగ్గింపు పొందొచ్చు. ఇలా వివో ఫోన్లపై తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం వివో స్మార్ట్‌ఫోన్లపై మాత్రమే కాకుండా ఇంకా ఇతర కంపెనీల ఫోన్లపై కూడా భారీ డీల్స్ లభిస్తున్నాయి. శాంసంగ్, మోటరోలా, రియల్‌మి, షావోమి, ఒప్పొ వంటి పలు కంపెనీలకు చెందిన ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు.

    అదేసమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో పోటీగా అమెజాన్‌లో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది. అందువల్ల మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా ఈ రెండు సైట్లలో ప్రొడక్టు వివరాలు ఎలా ఉన్నాయో చూడండి. అప్పుడే మీకు ఏ ప్రొడక్టు ఎందులో తక్కువకు వస్తోందో తెలుస్తుంది. తర్వాత మీకు నచ్చిన చోటు ఆ ప్రొడక్ట్ కొనొచ్చు.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Flipkart, Flipkart Big Billion Days, Latest offers, Smartphone, Vivo

    ఉత్తమ కథలు