Home /News /technology /

FLIPKART BIG BILLION DAYS SALE 2022 GET HUGE DISCOUNT ON THIS SMART TV KMV

Flipkart offers: రూ.1,13,990 టీవీని రూ.24 వేలకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్!

 రూ.1,13,990 టీవీని రూ.24 వేలకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్!

రూ.1,13,990 టీవీని రూ.24 వేలకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్!

Flipkart Sale | మీరు కొత్తగా స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయానలి ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.లక్ష విలువైన టీవీని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Flipkart Big Billion Days Sale | దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) ప్రారంభం అయ్యింది. ఈ సేల్‌లో భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. చాలా రకాల ప్రొడక్టులపై ఆఫర్లు ఉన్నాయి. వీటిల్లో స్మార్ట్‌టీవీలు కూడా ఒక భాగమని చెప్పుకోవచ్చు. మీరు టీవీ కొనాలని చూస్తే మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫాల్కన్ స్మార్ట్‌టీవీపై దుమ్ములేచిపోయే డీల్ అందుబాటులో ఉంది. 55 అంగుళాల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ (4కే) స్మార్ట్ ఆండ్రాయిట్ టీవీపై సూపర్ డీల్ లభిస్తోంది. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కాంట్రోల్, వీడియో కాల్ ఫీచర్‌తో వస్తున్న టీవీపై ఏకంగా రూ.వేలల్లో తగ్గింపు ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 1,13,990గా ఉంది. అయితే దీన్ని సేల్‌లో భాగంగా రూ. 37,999కు కొనొచ్చు. ఎయిర్‌టెల్ పండుగ గిఫ్ట్.. కస్టమర్లకు 5 జీబీ డేటా ఉచితం అంటే ఏకంగా 66 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఒకటి ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ. 11 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా మరో రెండు ఆఫ్లర్లు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టీవీ కొంటే రూ. 1750 తగ్గింపు వస్తుంది. అలాగే రూ. 24,999కు పైన విలువైన లావాదేవీలు నిర్వహిస్తే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా రూ. 750 తగ్గింపు లభిస్తుంది. ఆఫర్లంటే ఇవే.. ఈ ఫోన్లపై రూ.18 వేల భారీ తగ్గింపు ఇలా ఈ అదిరిపోయే టీవీపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే.. ఈ టీవీని కేవలం రూ. 24 వేలకే ఈ టీవీని కొనుగులు చేయొచ్చు. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదని చెప్పుకోవచ్చు. టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈఎంఐలో కూడా ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు. సంవత్సరం పాటు లోన్ టెన్యూన్ పెట్టుకుంటే వడ్డీ లేకుండా టీవీని కొనొచ్చు. నెలకు రూ. 3160 చెల్లిస్తే సరిపోతుంది. అదే 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1843 చెల్లించాలి.చాలా క్రెడిట్ కార్డులపై దాదాపు ఇలాంటి ఈఎంఐ ఫెసిలిటీనే ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ కార్డుపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తోంది. కేవలం ఈ టీవీపై మాత్రమే కాకుండా ఇతర టీవీలపై కూడా అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Flipkart, Flipkart Big Billion Days, Latest offers, Smart TV

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు