ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) ప్రారంభం కానుంది. దసరా సందర్భంగా ప్రారంభమయ్యే సేల్, దీపావళి వరకు కొనసాగుతుంది. సేల్ తేదీలను ఇంకా ప్రకటించలేదు ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌లో అందించబోయే ఆఫర్ల వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. స్మార్ట్ఫోన్లపై ఎలాంటి ఆఫర్స్ (Smartphone Offers) ఉంటాయో హింట్ ఇచ్చింది ఫ్లిప్‌కార్ట్. ఎప్పట్లాగే ఈసారి కూడా భారీ ఆఫర్స్ ఉండబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రతీ ఏటా బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి కూడా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్‌తో ఆకట్టుకోబోతోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్కు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు 24 గంటల ముందే యాక్సెస్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ లాంఛెస్, ఆఫర్స్, ఫ్లిప్‌కార్ట్ బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. రియల్మీ, పోకో, సాంసంగ్, ఒప్పో, వివో, యాపిల్, నథింగ్, మోటోరోలా, షావోమీ , ఇన్ఫీనిక్స్, గూగుల్, లావా బ్రాండ్ల మొబైల్స్‌పై ఆఫర్స్ పొందొచ్చు.
Mobile Releases: ఒకే రోజు... నాలుగు కొత్త స్మార్ట్ఫోన్ల రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభించబోతున్నాయి. ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 13 మోడల్స్‌పై అనూహ్యమైన డిస్కౌంట్స్ లభించడం ఖాయం. ఇక అన్ని స్మార్ట్ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఉన్నా, కొన్ని మొబైల్స్‌పై ఎక్కువగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఒప్పో రెనో 8 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.22,000 వరకు, రియల్మీ 9 ప్రో+ 5జీ మోడల్‌పై రూ.17,000 వరకు, సాంసంగ్ ఎస్22 ప్లస్ 5జీ మొబైల్‌పై రూ.22,000 వరకు, షావోమీ 11ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20,000 వరకు, పిక్సెల్ 6ఏ మొబైల్‌పై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.
The Big Billion Days are BACK! ???????? Ab poora India karega upgrade!#FlipkartBigBillionDays
— Flipkart (@Flipkart) September 5, 2022
ఈఎంఐ ద్వారా మొబైల్స్ కొనాలనుకునేవారికి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి. నోకాస్ట్ ఈఎంఐ రూ.1,750 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతీ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్ బయ్ నౌ పే లేటర్ ఆఫర్ ద్వారా కొనొచ్చు. సూపర్ కాయిన్స్ ఉన్నవారు వాటిని ఉపయోగించి స్మార్ట్‌పోన్లపై రూ.500 వరకు తగ్గింపు పొందొచ్చు. స్క్రీన్ కేర్ ప్లాన్‌లో భాగంగా 100 శాతం స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.99 నుంచే ప్రారంభం అవుతుంది. ఇక కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.199 నుంచి ప్రారంభం అవుతుంది.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేసినవారికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే ఫ్లిప్‌కార్ట్ క్విక్ ద్వారా కేవలం 45 నిమిషాల్లో మొబైల్ డెలివరీ అవుతుంది. ఇక ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి డిస్కౌంట్స్ లభిస్తాయో సెప్టెంబర్ 8 నుంచి రోజూ డీల్స్ రివీల్ చేయనుంది ఫ్లిప్‌కార్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Flipkart Big Billion Days, Mobile News, Smartphone