• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FLIPKART BIG BILLION DAYS SALE 2020 SAMSUNG GALAXY A50S TO GALAXY A70S UPTO RS 30000 DISCOUNT ON THESE SMARTPHONES SS

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Big Billion Days Sale 2020 | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. ఏకంగా రూ.30,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

  • Share this:
    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ భారీ ఆఫర్స్‌ని ప్రకటించింది. అంతేకాదు... ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌తో సాంసంగ్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మీరు ఏ సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కొన్నా ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు. స్మార్ట్‌ఫోన్‌ను 12 నెలలు వాడిన తర్వాత వెనక్కి ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకోవచ్చు. అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆ స్మార్ట్‌ఫోన్‌ను మీరే వాడుకోవాలంటే మిగతా 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 అనుకుందాం. మీరు డైరెక్ట్‌గా కొంటే రూ.10,000 చెల్లించాలి. అదే ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌తో కొంటే 30 శాతం అంటే రూ.3,000 తక్కువగా చెల్లించాలి. అంటే రూ.7,000 + రూ.100 ప్రోగ్రామ్ ఫీజు కలిపి రూ.7,100 మాత్రమే చెల్లించాలి. ఏడాది తర్వాత మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త ఫోన్ పొందొచ్చు. ఈ ప్లాన్‌కు నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాలతో పాటు నియమ నిబంధనలకు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ లేదా యాప్ చూడొచ్చు.

    Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

    Flipkart Big Billion Days Sale 2020, Flipkart Big Billion Days Sale smartphone offers, Flipkart Smart Upgrade Plan, Samsung Galaxy A50s, Samsung Galaxy A70s, Samsung Galaxy S20+, Samsung Galaxy Note 10+, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్, సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్
    image: Flipkart


    ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా రూ.30,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. సాంసంగ్ గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ అసలు ధర రూ.85,000. ఆఫర్‌లో రూ.54,999 ధరకే కొనొచ్చు. అంటే రూ.30,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎస్20+ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.77,999. ఆఫర్‌లో రూ.49,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.28,000 లభిస్తుంది. హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాదు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపైనా భారీ డిస్కౌంట్‌ను సాంసంగ్ ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.31,000. ఆఫర్‌‌లో రూ.22,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.8,001 లభిస్తుంది. ఇక సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.18,570. ఆఫర్‌లో రూ.13,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.4,571 లభిస్తుంది.

    Mi 10T: ఇండియాలో ఎంఐ 10టీ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

    Android Apps: అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్... వెంటనే డిలిట్ చేయండి

    ప్రస్తుతానికి ఈ ఆఫర్స్ మాత్రమే ప్రకటించింది సాంసంగ్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 15న సేల్ ప్రారంభమవుతుంది. అప్పట్లోపు మరిన్ని సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించే అవకాశముంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు