HOME »NEWS »TECHNOLOGY »flipkart big billion days sale 2020 get 10 per cent instant discount with sbi credit and debit cards ss

Flipkart SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ఎంత వస్తుందంటే

Flipkart SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ఎంత వస్తుందంటే
Flipkart SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ఎంత వస్తుందంటే (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Big Billion Days Sale 2020 | మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉందా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందడి మొదలైంది. ఈసారి కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. అయితే ఈ డిస్కౌంట్ ఎంతవరకు వస్తుందన్న సందేహం కస్టమర్లలో ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌లో పూర్తి వివరాలున్నాయి. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 21 రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇక ప్లస్ మెంబర్‌షిప్ లేని కస్టమర్లకు ఈ ఆఫర్ అక్టోబర్ 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 21 రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే ఆఫర్ వర్తించదు.

Online Shopping Tricks: ఫెస్టివల్ సేల్‌లో ఆర్డర్స్ చేస్తున్నారా? ఈ ట్రిక్స్ మీకోసమే



Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్


ఇక ఎంతవరకు డిస్కౌంట్ లభిస్తుందన్న విషయాన్నీ వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. గ్రాసరీ కాకుండా ఇతర ఏ ప్రొడక్ట్స్ కొన్నా కనీసం రూ.5,000 బిల్లింగ్ చేయాలి. అప్పుడే 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. గ్రాసరీ అయితే కనీసం రూ.1,500 బిల్ చేయాలి. ప్లస్ మెంబర్స్ అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో ఇతర కస్టమర్లు 16, 17 తేదీల్లో ఒక క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,750 వరకు, ఒక డెబిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక 18 నుంచి 21 వరకు ఒక క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,500 వరకు, ఒక డెబిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది కాకుండా రూ.30,000 కన్నా ఎక్కువ సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తే గరిష్టంగా రూ.1,250 డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. సింగిల్ ట్రాన్సాక్షన్ రూ.1,00,000 కన్నా ఎక్కువ చేస్తే అదనంగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ట్రావెల్ కేటగిరీలో డిస్కౌంట్ పొందాలనుకునేవారు FLYBBD కూపన్ కోడ్ ఉపయోగించాలి. కొన్ని ప్రొడక్ట్స్‌కి డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు. ఆ వివరాలను https://www.flipkart.com/pages/sbi-bbd-tnc వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Flipkart Sale: రూ.54,990 విలువైన స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్‌లో రూ.19,990 ధరకే... అదిరిపోయే ఆఫర్

Redmi Smartphone offers: ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

ఇక ఫ్లిప్‌కార్ట్ ఈసారి పేటీఎంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎం ద్వారా యూపీఐ, వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్‌పై క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:October 15, 2020, 11:36 am

टॉप स्टोरीज