అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!

'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018' అక్టోబర్ 10న ప్రారంభం కానుంది. క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లతో పాటు డెబిట్ కార్డులపై ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

news18-telugu
Updated: September 26, 2018, 12:58 PM IST
అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!
'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018' అక్టోబర్ 10న ప్రారంభం కానుంది. క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లతో పాటు డెబిట్ కార్డులపై ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
news18-telugu
Updated: September 26, 2018, 12:58 PM IST
ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు శుభవార్త. 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్'కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 10-14 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. దుస్తులు, టీవీలు, ఇంటికి కావాల్సిన వస్తువులపై మంచి డీల్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్లు, డెబిట్ కార్డులతో ఈఎంఐ సదుపాయం, నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ లాంటి సేవల్ని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లను మూడు గంటల ముందుగానే పొందొచ్చు.

అక్టోబర్ 10న టీవీలు, అప్లయెన్సెస్, స్మార్ట్ డివైజ్‌లపై ఆఫర్లుంటాయి. అక్టోబర్ 11న స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, యాక్సెసరీస్‌లపై డీల్స్ ఉంటాయి. వీటితో పాటు ప్రతీ గంటకు ఫ్లాష్ సేల్స్, ఎనిమిది గంటలకోసారి కొత్త డీల్స్ లభిస్తాయి.

ది బిగ్ బిలియన్ డేస్ సేల్ భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్. భారతదేశంలో పండుగల సీజన్‌ ఈ ఈవెంట్‌తో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఐదో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇది. కస్టమర్లకు ఉత్తమమైన ఆఫర్లు అందించడంపై దృష్టి పెట్టాం.

కళ్యాణ్ క్రిష్ణమూర్తి, సీఈఓ, ఫ్లిప్‌కార్ట్
ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనె, విరాట్ కోహ్లి లాంటి సెలబ్రిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్.

ఇవి కూడా చదవండి:
Loading...
అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7

ఇండియాలో రిలీజైన వివో వీ11

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!

 
First published: September 26, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...