Flipkart Big Billion days: రూ.7,500కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మేడిన్ హైదరాబాద్

ఎస్‌బీఐ డెబిట్, క్రిడిట్ కార్డుతో కొంటే 10శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.7470కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ టీవీ యూబ్యూట్ యాప్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

news18-telugu
Updated: October 18, 2020, 3:59 PM IST
Flipkart Big Billion days: రూ.7,500కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మేడిన్ హైదరాబాద్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దసరా, దీపావళి ఆఫర్లతో ఈ కామర్స్ సైట్స్ ఊరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్‌లో గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సందడి నెలకొంది. అన్ని వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక పండగ వేళ కొత్త టీవీ కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ధరకే లభించే టీవీలపైనే దృష్టిపెడుతుంటారు. అలాంటి వారందరికీ రూ.10వేల లోపు లభించే టీవీలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో అందుబాటులో ఉన్నాయి. cooca (కూకా) 32 ఇంచుల ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ రూ.7470 రూపాయలకే లభిస్తోంది.

పండగ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో cooca 32 inch HD ready Smart టీవీ ధరను రూ.8,299 నిర్ణయించారు. ఐతే ఎస్‌బీఐ డెబిట్, క్రిడిట్ కార్డుతో కొంటే 10శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.7470కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ టీవీ యూబ్యూట్ యాప్‌ను కూడా  సపోర్ట్ చేస్తుంది.

కూకా టీవీ


కూకా (Cooca) టీవీ ఫీచర్లు:

డిస్‌ప్లే సైజ్: 81 cm (32)

రిజల్యూషన్: HD Ready, 1366 x 768

సౌండ్ ఔట్‌పుట్: 20 వాట్స్

రీఫ్రెష్ రేట్: 60 HZ

హెచ్‌డీఎంఐ : 3

యూఎస్‌బీ: 1

వీటితో పాట్ ఇన్‌బిల్డ్ వైఫై, ఈతర్‌నెట్ వంటి ఫీచర్లున్నాయి. కూకా టీవీలు హైదరాబాద్ శివారులోని మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో ఉన్న ఫ్యాబ్ సిటీలో తయారవుతున్నాయి. ఈ టీవీలపై ఒక సంవత్సరం వ్యారంటీ లభిస్తుంది. ఐతే కూకా టీవీల్లో పిక్చర్ క్లారిటీ, సౌండ్ బాగున్నప్పటికీ.. కనెక్టివిటీ మాత్రం అంతగా బాగాలేని ఈ టీవీలు కొన్న వారు చెబుతున్నారు. మిగతా అంతా బాగానే ఉందని.. తక్కువ ధరలో టీవీ కొనాలనుకునేవారికి కూడా మంచి ఛాయిస్ అని అభిప్రాయపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: October 18, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading