అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు (Great Indian Festival Sale), ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు (Big Billion Days Sale) కౌంట్ డౌన్ మొదలైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 3న సేల్ ప్రారంభం కానుంది. మరి ఈ సేల్‌లో మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకున్నారా? ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) చేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్ పాటిస్తే మీకే లాభం. మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ట్రాక్ చేయాలి. కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు వెయిట్ చేసి వృథానే. మీరు డైరెక్ట్‌గా సేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయాలి.
ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. ఈ డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా ఉండాలి. అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ చూడకూడదు. మీరు ధరల్ని చాలాకాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు దర తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరల్ని ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.
Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే
మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్స్ ఉపయోగించుకుంటే లాభమే.
Realme Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్
ఇక ఫ్లాష్ సేల్స్‌లో లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ వస్తువు కొనాలనుకుంటే ఎక్కువ సేపు వెయిట్ చేయొద్దు. ముందుగానే ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఫ్లాష్ సేల్ సమయంలో ఆర్డర్ చేయాలి. ఇక మీరు కొనాలనుకునే వస్తువు ధర ఏ వెబ్‌సైట్‌లో ఎంత ఉందో చెక్ చేయాలి. కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. ఇంకొన్ని అమెజాన్‌లో దొరుకుతాయి. కానీ చాలావరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి.
iQOO Z5: అదిరే ఫీచర్స్‌తో ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... తొలి సేల్‌లో రూ.3,000 తగ్గింపు
ఉదాహరణకు మీరు వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే పెద్దపెద్ద బ్రాండ్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతుంటాయి. బ్రాండ్స్ వేర్వేరు అయినా ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏ బ్రాండ్ తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తుందో చూడాలి. మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వస్తువు కొనాలన్నా రేటింగ్స్, రివ్యూస్ ఓసారి చెక్ చేయాలి. రివ్యూస్ చదివితే ఆ ప్రొడక్ట్‌కు ఉన్న నెగిటీవ్ పాయింట్స్ తెలుస్తాయి.
ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జీవితంలో ఏదో ఓ దశలో అవసరం ఉన్న వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చన్న సూక్తిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Flipkart, Flipkart Big Billion Days, Online business, Online shopping