వచ్చే నెల నుంచి భారత్‌లో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది. దసరా నుంచి తర్వాతి సంవత్సరం సంక్రాంతి వరకు ఈ సందడి కొనసాగుతుంది. ఈ మధ్యలో అన్ని రకాల కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఈకామర్స్ (E-Commerce) కంపెనీల సందడి మామూలుగా ఉండదు. పండుగల సందర్భంగా భారీ డీల్స్ ప్రకటిస్తుంటాయి. అయితే ఈసారి పండుగ సీజన్‌కు ముందే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను (Flipkart Big Billion Days) ప్రకటించింది ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart). కంపెనీ తమ ప్లాట్ఫామ్లో ఈ స్పెషల్ సేల్ గురించి అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి సేల్ డేట్స్ వెల్లడించకపోయినా.. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బిలియన్ డేస్ 2022 ఉండవచ్చు.
బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ సందర్భంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ఫోన్లపై ఈ-కామర్స్ కంపెనీ అద్భుతమైన ఆఫర్లను అందించనుంది. ఈ యాన్యువల్ ఫెస్టివల్ సేల్‌లో అందించే ఆఫర్ల గురించి తాజాగా టీజర్లో వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్ . స్పెషల్ సేల్ త్వరలో ప్రారంభమై, దసరా వరకు కొనసాగవచ్చు. ఈ సందర్భంగా స్మార్ట్ఫోన్లతో పాటు గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఫ్లిప్‌కార్ట్ 40% వరకు తగ్గింపును అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ అందించే స్పెషల్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
కొత్త ప్రొడక్ట్స్ లాంచ్..
ఫ్లిప్‌కార్ట్ రిలీజ్ చేసిన ఇ-టైలర్లో సేల్ టైమ్‌లో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్ల గురించి వివరాలు ఉన్నాయి. ఇప్పటివరకు కంపెనీ లాంచ్ చేస్తున్న స్మార్ట్ఫోన్లలో రెండు పేర్లను మాత్రమే వెల్లడించింది. అవే రియల్మీ C33, పోకో M5. పోకో ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 13న ప్రారంభం కానుంది. దీని ధర రూ.10,999. సేల్ డేట్స్‌లో మరిన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ (1), శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4, గెలాక్సీ Z ఫోల్డ్ 4, వివో V25 ప్రో, రియల్మీ GT 2 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్ అందించనుంది.
బ్యాంకులతో ఒప్పందం
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో చేసే కొనుగోళ్లపై ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డిస్కౌంట్లను అందించనుంది. ఇందుకు ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. సేల్ పీరియడ్‌లో కస్టమర్లు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, బై నౌ పే లేటర్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
ఈ సేల్‌లో శామ్సంగ్ గెలాక్సీ S22 ప్లస్ 5G ఫోన్‌ను రూ. 22,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సొంతం చేసుకోవచ్చు. రియల్మీ 9 ప్రో + 5G మోడల్‌పై అత్యధికంగా రూ.17,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఒప్పో రెనో 8 ప్రో ఫోన్‌పై రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E-commerce, Flipkart, Smartphones