Flipkart Sale | ఆన్లైన్ షాపింగ్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కొత్త సేల్ తీసుకువచ్చింది. బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 3న ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా కస్టమర్లు ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు (Offers) సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంటోంది. ఫ్రీ డెలివరీ, తక్కువ ధరలు, ఈజీ రిటర్న్స్ వంటి ప్రయోజనాలు పొందొచ్చని తెలియజేస్తోంది.
ధమాల్ డీల్స్, లూట్ బజార్, కాంబో డీల్స్ వంటివి ఉండనున్నాయి. సేల్ జరిగేటప్పుడు ప్రతి రోజూ రాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ధమాల్ డీల్స్ ఉంటాయి. అలాగే లూట్ బజార్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తక్కువ ధరలు ఉండనున్నాయి. కాంబో డీల్స్ అనేవి రాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు లభిస్తాయి.
రూ.5 వేల స్మార్ట్‌వాచ్ రూ.1299కే!
ట్రెండీ అంబ్రెలాల మీద 80 శాతం వరకు తగ్గింపు ఉంది. యుటిలిటీస్ అండ్ ఆర్గనైజర్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఎసెన్షియల్స్ ధర రూ. 119 నుంచి ప్రారంభం అవుతోంది. పెయింట్ ఎసెన్షియల్ ధర రూ. 149 నుంచి స్టార్ట్ అవుతుంది. బాత్ ఫిట్టింగ్స్ వంటి వాటి ధర రూ. 199 నుంచి ఉంటుంది. హోమ్ యుటిలిటీస్ ధర రూ. 99 నుంచి ప్రారంభం అవుతోంది. డోర్ మ్యాట్స్, కార్పెట్స్ ధర రూ. 49 నుంచి ఉంటుంది.
ఏకంగా రూ.17 వేల డిస్కౌంట్.. రూ.12,990కే 39 ఇంచుల టీవీ, కిర్రాక్ ఆఫర్!
రియల్‌మి 9ఐ, ఐఫోన్ , పోకో ఎం4 ప్రో, శాంసంగ్ 23 5జీ, షావోమి 11ఐ, నార్గో 50ఏ, ఒప్పొ రెనో 7 ప్రో, ఇన్ఫినిక్స్, మోటరోలా, వివో , మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2, జియోనీ వంటి పలు స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఈ ఆఫర్లను రివీల్ చేయలేదు. అలాగే ట్రిమ్మర్ల ధర, హెడ్‌ఫోన్స్ ధర రూ. 399 నుంచి ప్రారంభం అవుతోంది. స్మార్ట్ వాచ్‌లను రూ. 999 ప్రారంభ ధరతో కొనొచ్చు. రూమ్ హీటర్ల ధర రూ. 599 నుంచి ప్రారంభం అవుతోంది. కార్ అండ్ బైక్ యాక్ససిరీస్, బుక్స్ అండ్ మీడియా, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెట్, టాయ్స్ అండ్ స్టేషనరీ ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా మెడిసిన్స్ అండ్ సప్లైపై 85 శాతం వరకు కూడా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Latest offers, Mobile offers, Money, Offers