Flipkart Sale: లాక్‌డౌన్‌‌ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్... ఆఫర్స్ ఇవే

Flipstart Days Sale | ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఆన్‌లైన్ షాపింగ్ సందడి మొదలైంది. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్.

news18-telugu
Updated: June 1, 2020, 11:19 AM IST
Flipkart Sale: లాక్‌డౌన్‌‌ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్... ఆఫర్స్ ఇవే
Flipkart Sale (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వం ఆంక్షల్ని సడలించిన తర్వాత ఇ-కామర్స్ సైట్లలో సేల్స్ మళ్లీ మొదలవుతున్నాయి. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ మరోసారి సేల్ ప్రారంభించింది. భారతదేశంలో మార్చిలో లాక్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ఆంక్షల సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇ-కామర్స్ సైట్లు కూడా తమ బిజినెస్ నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్లిప్‌కార్ట్ 'ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్' ప్రారంభించింది. జూన్ 1న ప్రారంభమైన సేల్ జూన్ 3 వరకు కొనసాగుతోంది. దాదాపు అన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్‌తో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ లాంటి ఉత్పత్తులపై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ప్రొడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. లాక్‌డౌన్ కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. స్పీకర్లు, హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి ల్యాప్‌టాప్స్ ముఖ్యంగా మారిపోయాయి. ల్యాప్‌టాప్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ట్యాబ్లెట్స్ రూ.4,299 ధర నుంచే లభిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

SBI Moratorium: 6 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువ కట్టాలి... ఇదీ లెక్క

JioFiber: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియో ఫైబర్ ప్లాన్స్‌పై బెనిఫిట్స్ ఇవే

PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... కొత్త సర్వీస్ ప్రారంభించిన కేంద్రం
Published by: Santhosh Kumar S
First published: June 1, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading