FLIPKART BACK TO COLLEGE SALE BUY THESE ELECTRONIC GADGETS WITH 80 PERCENT DISCOUNT NS
Flipkart Back To College: ఫ్లిప్ కార్ట్ లో స్టూడెంట్స్ కోసం స్పెషల్ సేల్.. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్
ప్రతీకాత్మక చిత్రం
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) ప్రస్తుతం విద్యార్థుల కోసం Back To College Sale నిర్వహిస్తోంది. ఈ సేల్ లో వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లలో వినియోగదారులకు తక్కువ ధరలకే (Offers) అనేక ఉత్పత్తులను అందిస్తూ ఉంటుంది. తాజాగా మరో సేల్ లో ఫ్లిప్ కార్ట్ వినియోగదారుల ముందుకు వచ్చింది. తాజాగా విద్యార్థుల కోసం Back To College సేల్ ను ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్. ఈ నెల 14న మొదలైన ఈ సేల్ 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో విద్యార్థులకు అవసరమైన గాడ్జెట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. JBL, boAT, realmeతో పాటు ఇతర హెడ్ ఫోన్స్, స్పీకర్లపై 70 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ట్రిమ్మర్లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. కీ బోర్డులు, మౌస్ లు, ప్రింటర్స్ తదితర వస్తువులు రూ.149 నుంచే అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
ఇంకా గేమింగ్ యాక్ససరీస్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంకా స్మార్ట్ వాచ్ లపై 60 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రింటర్స్ రూ.5,199 ధరల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్. ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్ చేసే వారికి ఇంకా అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ కార్డులతో షాపింగ్ చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. Smartphone Offer: ఆ ఆఫర్ మళ్లీ వచ్చింది... ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్
కరోనా నేపథ్యంలో ఆన్లైన్ విద్యకే విద్యాసంస్థలు, స్టూడెంట్స్, పేరెంట్స్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ల్యాప్ టాప్, ఇంటర్ నెట్, హెడ్ ఫోన్స్ తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ సేల్ ను సద్వినియోగం చేసుకుంటే తక్కువ ధరకే వారి విద్యావసరాలకు కావాల్సిన ఎలక్ట్సానిక్ వస్తువులను సొంతం చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.