news18-telugu
Updated: December 17, 2019, 11:24 AM IST
Flipkart Year End Sale 2019: భారీ ఆఫర్లతో 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019'... డిస్కౌంట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
దసరా, దీపావళి సేల్ తర్వాత మరో భారీ సేల్‌కు రంగం సిద్ధం చేసింది ఫ్లిప్‌కార్ట్. డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019' జరగనుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డిసెంబర్ 20 రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్... ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. సాంసంగ్, షావోమీ, రియల్‌మీ లాంటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75% వరకు, ఫ్యాషన్ వేర్‌పై 50-80% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఫ్యాషన్ వేర్‌లో 1000 బ్రాండ్స్ ఉత్పత్తులపై ఆఫర్లు ఉండబోతున్నాయి. ఇక ఫర్నీచర్‌పై 80% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. దాంతోపాటు ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపైనా 80% వరకు తగ్గింపు పొందొచ్చు.
ఇక ఈ డిస్కౌంట్స్, ఆఫర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రత్యేకంగా ఉండే బ్లాక్ బస్టర్ డీల్స్, రష్ హవర్, ప్రైస్ క్రాష్, కాంబో డీల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఉంటాయి. అర్థరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు బ్లాక్‌బస్టర్ డీల్స్, అర్థరాత్రి 2 గంటల వరకు రష్ హవర్ డిస్కౌంట్స్, 15% అదనపు డిస్కౌంట్‌తో ప్రైస్ క్రాష్ ఆకట్టుకోనున్నాయి. కాంబో డీల్స్‌లో భాగంగా ఒకేసారి 3 ప్రొడక్ట్స్ కొన్నవారికి 10% అదనపు డిస్కౌంట్, 4 వస్తువులు కొన్నవారికి 15% తగ్గింపు లభిస్తుంది. వీటన్నిటితో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Jio VoWiFi: జియో నుంచి సరికొత్త ఫీచర్... నెట్‌వర్క్ లేకపోయినా కాల్ చేయొచ్చు ఇలా
IRCTC: కేరళ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీPAN-Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ డిసెంబర్ 31... లింక్ చేయండిలా
Published by:
Santhosh Kumar S
First published:
December 17, 2019, 11:24 AM IST