ఇటీవలి కాలంలో ఈ కామర్స్ (E-Commerce) సంస్థలు వరుస సేల్స్ నిర్వహించి వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతీ నెల ఒకటి, రెండు సేల్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ (Flipkart) సంస్థ మరో సేల్ ను ప్రకటించింది. త్వరలోనే THE BIG BILLION DAYS SALE ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో భారీ ఆఫర్లు ఉండనున్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో Realme, POCO, Vivo, Samsung కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ల (Smartphones) బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నట్లు వెల్లడించింది ఫ్లిప్ కార్ట్. ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ఉంటుందనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు ఫ్లిప్ కార్ట్.
- ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నట్లు సేల్స్ పేజీలో తెలిపారు. ట్రిమ్మర్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వెల్లడించింది. ఇంకా స్క్రీన్ కార్డులు రూ.99 నుంచే ప్రారంభం కానున్నాయి. గేమింగ్ ల్యాప్ టాప్ లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్. ప్రింట్లరు, మానిటర్లపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
- టీవీలు మరియు ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపులు ఉండనున్నాయి. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలు రూ.8,999 నుంచే ప్రారంభం కానున్నాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఐరన్ బాక్స్ లు రూ.299 నుంచే ప్రారంభం కానున్నాయి. ఏసీలపై 55 శాతం తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Smartphones Under Rs.30000: రూ.30 వేలలోపు లభించే బెస్ట్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి
- ఫ్యాషన్ వస్తువులపై ఏకంగా 60-90 శాతం డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. పురుషుల షర్ట్ లపై 60 శాతం తగ్గింపులు ఉండనున్నాయి. ఇంకా Nike, Adidas, Puma షూలపై 50-80 శాతం తగ్గింపులు ఉండనున్నాయి.
- మహిళల డ్రెస్ లు, జీన్స్ పై 90 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి. పురుషుల టీ-షర్ట్ లు, జీన్స్ పై 80 శాతం వరకు తగ్గింపులు లభించనున్నాయి.
- ఇంకా హోం మరియు కిచెన్ వస్తువులపై 50-80 శాతం డిస్కెంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫర్నీచర్ పై 85 శాతం వరకు తగ్గింపులు లభించనున్నాయి.
-ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్లు లభించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, E-commerce, Flipkart, Latest offers