Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బిగ్ దివాళీ సేల్... ఈసారి ఆఫర్స్ ఇవే

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బిగ్ దివాళీ సేల్... ఈసారి ఆఫర్స్ ఇవే (image: Flipkart)

Flipkart Big Diwali Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone), స్మార్ట్ టీవీ (Smart TV) కొనాలనుకొని కొనలేకపోయారా? ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ దివాళీ సేల్ నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు జరిగే సేల్‌లో భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.

  • Share this:
    ఆన్‌లైన్ షాపింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరోసారి బిగ్ దివాళీ సేల్ (Big Diwal Sale) ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 4 వరకు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు అక్టోబర్ 27న ఈ సేల్ ప్రారంభం అవుతుంది. దసరా, దీపావళి సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న మూడో సేల్ ఇది. అక్టోబర్ 3 వరకు 10 బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale), అక్టోబర్ 17 నుంచి 23 వరకు బిగ్ దివాళీ సేల్ (Big Diwal Sale) నిర్వహించింది ఫ్లిప్‌కార్ట్. దీపావళికి మరో 10 రోజులు ఉండటంతో మరోసారి సేల్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌ను బిగ్ దివాళీ సేల్ పేరుతోనే కొనసాగిస్తోంది. మిగతా సేల్స్ లాగానే ఈ సేల్‌లో కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.

    ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డుతో కొంటే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లాంటి ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వరకు 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే రెడ్‌మీ 9 ప్రైమ్, ఎంఐ 11 లైట్, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ల ధర కూడా భారీగా తగ్గనుంది.

    Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా


    ఇక ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2020 లాంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌తో లభించనున్నాయి. ఇటీవల ముగిసిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ రూ.53,999 ధరకు, ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ రూ.42,099 ధరకు లభించింది. త్వరలో ప్రారంభమయ్యే సేల్‌లో కూడా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్‌తో లభించనున్నాయి.

    Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

    వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అర్ధరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు క్రేజీ డీల్స్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రతీ గంటకు స్పెషల్ ఆఫర్‌తో టైమ్ బాంబ్ డీల్స్‌ లభిస్తాయి. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్స్‌పై 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌ 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేవారికి డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.2,500 వరకు తగ్గింపు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.25,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: