పండుగ సీజన్ వచ్చేయడంతో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ని ప్రకటించింది అమెజాన్. ఎస్బీఐ కార్డుపై ఆఫర్లు కూడా అందించనుంది. తేదీలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 6 రోజుల పాటు ఈ సేల్ ఉండబోతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి సేల్ 4 గంటల ముందే మొదలవుతుంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్... ఇలా ప్రతీ ప్రొడక్ట్‌పై భారీ ఆఫర్లు అందించనుంది. అయితే ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ వస్తుందన్న విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించలేదు. ప్రతీ రోజు ఉదయం 8, మధ్యాహ్నం 12, రాత్రి 8, అర్థరాత్రి 12 గంటలకు క్రేజీ డీల్స్ ఉంటాయి. 6 రోజుల పాటు ప్రతీ గంటకు ఓ ప్రొడక్ట్స్ ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది ఫ్లిప్‌కార్ట్. అర్థరాత్రి 12 నుంచి 2 గంటల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్‌తో రష్ హవర్స్ ఉంటాయి. ఇక కాంబో ఆఫర్లో 3 వస్తువులు కొన్నవారికి 10%, 4 వస్తువులు కొన్నవారికి 15%, రూ.1,999 కొన్నివారికి 15%, రూ.1,499 కొన్నవారికి 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. మిస్టరీ బాక్స్‌లో ఐఫోన్ XR గెలుచుకునే అవకాశముంది.
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వివరాలివే
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29న ప్రారంభం అవుతుంది. మొదటి రోజు నుంచి ఫ్యాషన్ వేర్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఆఫర్లు సేల్ ముగిసే రోజు అంటే అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. ఇక సెప్టెంబర్ 30న స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్‌పై డిస్కౌంట్లు ఉంటాయి. ఈసారి స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అంచనా. ఆపిల్ ఐఫోన్ మోడల్స్‌పై సుమారు రూ.5,000 వరకు తగ్గింపు ఉండొచ్చు. వాటితో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్, ఏసుస్ 6జెడ్, రెడ్మీ కే20 సిరీస్ ఫోన్లు కూడా డిస్కౌంట్స్ ఉండే అవకాశముంది.
ఇక యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకూ ఇదే వర్తిస్తుంది. వీటితో పాటు కార్డ్‌లెస్ క్రెడిట్, ఫ్లిప్‌కార్ట్ పేలేటర్, ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ లాంటి పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. దసరా, దీపావళి సమయంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నిర్వహించే సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈసారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం లాంటి ఇ-కామర్స్ సైట్లు నిర్వహించే సేల్స్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?
ఇవి కూడా చదవండి:
SBI SMS Alerts: ఎస్బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి
IRCTC: రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయండి ఇలా...
Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్లోడ్ చేయండి ఇలా...