Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సర్‌ప్రైజ్... దీపావళికి ముందే మరో సేల్

Flipkart Big Diwali Sale | ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దివాళీ సేల్'లో ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్‌ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్స్ అందించనుంది ఫ్లిప్‌కార్ట్.

news18-telugu
Updated: October 7, 2019, 10:27 AM IST
Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సర్‌ప్రైజ్... దీపావళికి ముందే మరో సేల్
Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సర్‌ప్రైజ్... దీపావళికి ముందే మరో సేల్ (image: Flipkart)
news18-telugu
Updated: October 7, 2019, 10:27 AM IST
దసరా సేల్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇంకా ఇంటికి డెలివరీ కానేలేదు. అప్పుడే మరో సేల్‌ని ప్రకటించేసింది ఫ్లిప్‌కార్ట్. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 5 రోజుల పాటు 'బిగ్ దివాళీ సేల్' నిర్వహించబోతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 11 రాత్రి 8 గంటలకే సేల్ ప్రారంభం కానుంది. దసరా సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం సేల్స్ పెరిగినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పుడు అదే జోష్‌తో 'బిగ్ దివాళీ సేల్' ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దివాళీ సేల్'లో ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్‌ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్స్ అందించనుంది ఫ్లిప్‌కార్ట్. దాంతోపాటు కంప్లీట్ అప్లయెన్స్ ప్రొటెక్షన్, కార్డ్‌లెస్ క్రెడిట్ అందించనుంది. రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.6,490 మాత్రమే.

ఇక ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 3 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్స్‌ఛేంజ్ లాంటి సదుపాయాలుంటాయి. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పైనా 50-80% వరకు, ఫర్నీచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు అందించనుంది. ఇక మహా ప్రైస్ డ్రాప్‌ సేల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై అదనంగా 15% డిస్కౌంట్, మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై రోజు అర్థరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు ధమాకా డీల్స్, రష్ హవర్స్‌లో అర్థరాత్రి 12 నుంచి 2 గంటల వరకు అదనపు డిస్కౌంట్స్ అందించనుంది. 'బిగ్ దివాళీ సేల్'లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Redmi 8: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... దీపావళి కన్నా ముందే రెడ్‌మీ 8 రిలీజ్

Samsung Galaxy Fold: ఈ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు... సాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ధర తెలిస్తే షాకే
Loading...
WhatsApp: మీరు పంపిన వాట్సప్ మెసేజ్‌ను 5 సెకండ్లలో మాయం చేయొచ్చు
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...