ఆధార్ నెంబర్‌ చెప్తే అప్పు ఇచ్చేస్తారు!

మొన్నటి వరకు ఆధార్ నెంబర్ విషయంలో రచ్చరచ్చైంది. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ నెంబర్ తీసుకోకూడదని ఏకంగా సుప్రీం కోర్టే చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో అదేమీ వర్కవుట్ కావట్లేదు. ఆధార్ నెంబర్ నమోదు చేస్తే యూజర్లకు అప్పు ఇస్తున్నాయి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌.

news18-telugu
Updated: October 11, 2018, 12:09 PM IST
ఆధార్ నెంబర్‌ చెప్తే అప్పు ఇచ్చేస్తారు!
image: Getty Images
  • Share this:
ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్లు ఫెస్టివల్‌ సేల్‌తో సందడి చేస్తున్నాయి. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ రెండు సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆధార్ నెంబర్‌పై అప్పు ఇవ్వడం యూజర్లను ఆకట్టుకుంటోంది.

ఇ-కామర్స్ సైట్‌లో ఏదైనా కొనడానికి డబ్బులు లేకపోతే రూ.60,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తున్నాయి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌. ఇందుకోసం యూజర్లు పాన్‌, ఆధార్ నెంబర్లను వెల్లడించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా యూజర్లకు ఎంతవరకు క్రెడిట్ వస్తుందో తెలుస్తుంది.

ఆధార్ నెంబర్ విషయంలో ఇటీవల రచ్చరచ్చైంది. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ నెంబర్ తీసుకోకూడదని ఏకంగా సుప్రీం కోర్టే చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మామూలుగానే ఉంది. తమ యూజర్లకు అప్పు ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆధార్ నెంబర్‌పై ఏకంగా అప్పులే ఇస్తుండటం, యూజర్లు కూడా ఆధార్ నెంబర్ వెల్లడిస్తుండటం చూస్తుంటే... ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సీరియస్‌గా తీసుకోలేదా అన్న వాదన తెరపైకి వస్తోంది.

ఇవి కూడా చదవండి:అమెజాన్‌లో ఈ ఆఫర్లు చూశారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
First published: October 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు