Home /News /technology /

FLIP KART BIG BILLION DAYS SALE STARTS FROM JULY 23 TO JULY 27 THIS SALE PHONES ARE AVAILABLE FOR LESS THAN 10 THOUSAND RUPEES KNOW DETAILS HERE VB

Flipkart Big Billion Days: ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.20వేల ఫోన్లు రూ.10 వేలలోపు అందుబాటులోకి..

Flipkart Big Billion Days: ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.20వేల ఫోన్లు రూ.10 వేలలోపు అందుబాటులోకి..

Flipkart Big Billion Days: ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.20వేల ఫోన్లు రూ.10 వేలలోపు అందుబాటులోకి..

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్(Flipkart Big Billion Day Sale) ప్రారంభమైంది. ఇది జూలై 23న ప్రారంభం అయింది. ఈ సేల్(Sale) జూలై 27 వరకు కొనసాగుతుంది. మొత్తం 5 రోజుల పాటు ఈ సేల్ జరుగుతంది. ఈ సమయంలో ఈకామర్స్ కంపెనీ(E Commerce Company) అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లు అండ్ ఇతర ఆఫర్లను అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లలో(Smart Phones) దాదాపు ఎప్పుడూ లేని విధంగా కూపన్స్, డిస్కౌంట్లను(Discounts) ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లలో Redmi అండ్ Motorola వంటి బ్రాండ్‌ ఫోన్‌లు ఉన్నాయి. ఈ కంపెనీలకు చెందిన చాలా స్మార్ట్‌ఫోన్‌లు సేల్‌లో 10 వేల కంటే తక్కువ ధరకు విక్రయించబడుతున్నాయి. కాబట్టి మీరు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయాలంటే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో లభించే ఆ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. అవేంటంటే..

Career In Medical Courses: NEET లేకుండా కూడా వైద్య వృత్తిని చేపట్టోచ్చు.. రూ.లక్షల్లో జీతం.. ఎలా అంటే..


OPPO A11K
2 GB + 32 GB మోడల్ OPPO A11Kపై 31 శాతం తగ్గింపు ఇవ్వబడుతోంది. దీని ద్వారా ఈ ఫోన్‌ను రూ. 7,490కి విక్రయంలో కొనుగోలు చేయవచ్చు. OPPO A11K 6.22 అంగుళాల HD + డిస్‌ప్లే, 13MP + 2MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4230 mAh బ్యాటరీ మరియు MediaTek Helio P35 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

Motorola G22
స్మార్ట్‌ఫోన్ 28 శాతం తగ్గింపుతో విక్రయించబడుతోంది. దీని 4 GB + 64 GB మోడల్ 9,999 రూపాయలకు విక్రయించబడుతోంది. ఫోన్ 6.5 అంగుళాల HD + డిస్ప్లే, 50MP + 8MP + 2MP + 2MP వెనుక కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ అండ్ Mediatek Helio G37 ప్రాసెసర్‌తో వస్తుంది.



Redmi 9i Sport
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Redmi 9i Sport 4GB + 64GB మోడల్‌పై 12% తగ్గింపును పొందుతోంది. దీని కారణంగా ఈ ఫోన్‌ను కేవలం రూ.8,799కే కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో 6.53 అంగుళాల HD + డిస్ప్లే, 13MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ మరియు MediaTek Helio G25 ప్రాసెసర్ ఉన్నాయి.

Infinix HOT 12 Play
Infinix యొక్క ఈ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 29 శాతం తగ్గింపును పొందుతోంది. దీని కారణంగా ఫోన్ యొక్క 4 GB + 64 GB మోడల్‌ను రూ 8,499 కు కొనుగోలు చేయవచ్చు. 6.82-అంగుళాల HD + డిస్ప్లే, 13MP + డెప్త్ లెన్స్ వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ మరియు Unisoc T610 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Bank Jobs 2022: EXIM బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా.. 


POCO C31
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో.. POCO C31 స్మార్ట్‌ఫోన్ 33 శాతం తగ్గింపుతో విక్రయించబడుతోంది. దీని 4 GB + 64 GB వేరియంట్ లో రూ. 7,999కి విక్రయించబడుతోంది. ఫోన్‌లో 6.53 అంగుళాల HD + డిస్ప్లే, 13MP + 2MP + 2MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ మరియు MediaTek Helio G35 ప్రాసెసర్ ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Flipkart, Flipkart Big Billion Days, Flipkart Big Diwali Sale, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు