FLAT TIRE IS THE CAR TIRE PUNCTURED KNOW HOW TO CHANGE THE FLAT TIRE LIKE THIS GH EVK
Flat Tyre: కారు టైర్ పంక్చర్ అయిందా? ఫ్లాట్ టైర్‌ను ఇలా మార్చుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Flat tyre change | చాలామంది పంక్చర్ అయిన ఫ్లాట్ టైర్‌ను మార్చడం క్లిష్టతరమైన పనిగా భావిస్తారు. దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉంటే వారి సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫ్లాట్ టైర్‌ను ఇలా మార్చుకోవాలో తెలుసుకోండి. చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
సొంత కారు (Car) లేదా బైక్స్ డ్రైవ్ చేస్తున్న వారికి కొద్దిపాటి మెకానికల్ స్కిల్స్ (Mechanical Skills) కూడా తెలిసి ఉండాలి. ముఖ్యంగా టైర్ల పంక్చర్ (Puncture) వేయడం, ఇంజన్ ఆయిల్ మార్చుకోవడం, ఫ్లాట్ టైర్ మార్చుకోవడం లాంటి సాధారణ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది పంక్చర్ అయిన ఫ్లాట్ టైర్‌ను మార్చడం (Flat tyre change) క్లిష్టతరమైన పనిగా భావిస్తారు. దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉంటే వారి సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు పంక్చర్ అయిన టైరుతోనే కారును గ్యారేజ్ (Garage) వద్దకు నెమ్మదిగా తీసుకెళ్తారు. అయితే ఇది మరింత నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఫ్లాట్ టైర్‌ను స్టెఫినీ టైర్‌తో రీప్లేస్ చేయడం నేర్చుకోవాలి. సులభంగా ఫ్లాట్ టైర్‌ను మార్చడం ఎలాగో తెలుసుకుందాం.
ఉపరితలం సమానంగా ఉండాలి..
పంక్చర్ అయినప్పుడు ముందుగా బండిని ఫ్లాట్‌గా ఉండే ఉపరితలంపై ఆపండి. ఎందుకంటే ఎగుడుదిగుడుగా ఉంటే జాక్ స్థిరంగా ఉండదు. ఇదే సమయంలో మెత్తగా, మృదువుగా ఉండే ప్లాట్‌ఫాంలపై కూడా వాహనాన్ని నిలపకూడదు. సర్ఫేస్ లెవల్‌గా, గట్టిగా ఉండే ప్రాంతంలో కారును ఆపాలి.
హ్యాండ్బ్రేక్స్, గేర్లు..
ఫ్లాట్ సర్ఫేస్పై బండిని ఆపిన తర్వాత హ్యాండ్‌బ్రేక్ (Hand Break) వేసి కారును గేరులోనే ఉంచండి. ఇలా చేస్తే టైర్ మార్చేటప్పుడు కారు కదలదు. ఒకవేళ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంటే గేర్‌ను పార్క్‌లోనే ఉంచడం మంచిది.
ఫ్లాట్ అయిన టైర్‌ను వదులుచేయండి..
అనంతరం ఫ్లాట్ అయిన టైరును వదులు చేయడం ప్రారంభించాలి. నట్లు లేదా బోల్టులను విప్పడానికి వీల్ స్పానర్ను ఉపయోగించండి. చేతితో తిప్పగలిగేంత వదులైన తర్వాత తిప్పడం ఆపండి.
కారును పైకి లేపడం..
నట్స్ లూజ్ చేసిన తర్వాత కారు కింద సరైన ప్రదేశంలో జాక్‌ను ఉంచండి. చాలా కార్లకు జాక్‌ను ఎక్కడ ఉంచాలో తెలిపే గుర్తులు ఉంటాయి. జాక్ ఉంచిన తర్వాత టైర్ స్వేచ్ఛగా తిరిగేంత వరకు కారును పైకి ఎత్తడం ప్రారంభించండి.
టైరు మార్చండి.. కారును తగినంత పైకి లేపిన తర్వాత ఇప్పటికే వదులు చేసిన బోల్టులను తీసేసి ఫ్రేమ్ నుంచి టైర్‌ను తీసేయాలి. అనంతరం స్పేర్ టైర్‌ను వీల్‌పై బోల్టులతో సరైన క్రమంలో అమర్చండి. ఆ తర్వాత నట్స్‌ను జాగ్రత్తగా అమర్చి టైట్‌గా ఫిక్స్ చేయండి. టైర్ ప్లేస్మెంట్ నుంచి కదలకుండా ఉండేంత టైట్ చేయాలి.
జాక్‌ను తీసేయండి
నట్స్ బిగించిన తర్వాత టైర్ మళ్లీ భూమికి తాకేలా జాక్‌ను తగ్గించండి. ఇప్పుడు అన్ని నట్స్, బోల్ట్స్ టైట్ చేసి కారును నడపవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.