హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi K20 Pro: గుడ్ న్యూస్... జూలై 17న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 రిలీజ్

Redmi K20 Pro: గుడ్ న్యూస్... జూలై 17న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 రిలీజ్

Redmi K20 Pro: గుడ్ న్యూస్... జూలై 17న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 రిలీజ్
(Xiaomi)

Redmi K20 Pro: గుడ్ న్యూస్... జూలై 17న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 రిలీజ్ (Xiaomi)

Redmi K20 Pro | షావోమీ కంపెనీకి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా అదే రోజున ఎంఐ పాప్ 2019 ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనుంది. అదే ఈవెంట్‌లో రెడ్‌మీ కే20 ఇండియాలో రిలీజ్ అవుతోంది.

షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. చాలాకాలంగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 స్మార్ట్‌ఫోన్‌లు జూలై 17న ఇండియాలో రిలీజ్ కానున్నాయి. ఈ ఏడాది మేలో ఈ రెండు ఫోన్లు చైనాలో రిలీజ్ అయ్యాయి. 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0' అంటూ షావోమీ ప్రచారం చేస్తోంది. వన్‌ప్లస్‌ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు రెడ్‌మీ కే 20 ప్రోతో పోటీ ఇస్తుందని షావోమీ ప్రచారం చేస్తోంది. చైనాలో లక్షలాది ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. దీంతో ఇండియాలో రెడ్‌మీ కే20 ఫోన్లపై షావోమీ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ ఫోన్లు ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు షావోమీ ఫ్యాన్స్. మొత్తానికి షావోమీ గుడ్ న్యూస్ చెప్పేసింది. జూలై 17న రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. షావోమీ కంపెనీకి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా అదే రోజున ఎంఐ పాప్ 2019 ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనుంది. అదే ఈవెంట్‌లో రెడ్‌మీ కే20 ఇండియాలో రిలీజ్ అవుతోంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాప్-అప్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.

రెడ్‌మీ కే 20 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్

ర్యామ్: 6జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730

రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై

సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్

ధర:

6జీబీ+64జీబీ- సుమారు రూ.20,000

6జీబీ+128జీబీ- సుమారు రూ.21,000

రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.35 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్

ర్యామ్: 6జీబీ, 8జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855

రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై

సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ ఫైబర్ బ్లాక్

ధర:

6జీబీ+64జీబీ- సుమారు రూ.25,000

6జీబీ+128జీబీ- సుమారు రూ.26,000

8జీబీ+128జీబీ- సుమారు రూ.28,000

8జీబీ+256జీబీ- సుమారు రూ.30,000

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో

ఇవి కూడా చదవండి:

Smartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి

Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990

HDFC Bank: ఆ యాప్‌తో జాగ్రత్త... కస్టమర్లను హెచ్చరిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ

First published:

Tags: Android, Redmi, Xiaomi

ఉత్తమ కథలు