Google Pay: గూగుల్ పేలో ఫిక్స్ డిపాజిట్.. చేసేయండి ఇలా

(ప్రతీకాత్మక చిత్రం)

ప్ర‌ముఖ డిజిటల్ పేమెంట్‌లో గూగుల్‌పే(Google Pay) వినియోగ‌దారులకు కొత్త పెట్టుబ‌డి అవ‌కాశం అందించింది. గూగుల్ పే ప్లాట్ ఫాంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్(Deposit) చేసుకొనే వెసులుబాటు క‌ల్పిస్తోంది. ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని గూగుల్‌పే చెబుతుంది. వినియోదారుల‌కు పొదుపు చ‌ర్య‌ల కార‌ణంగా మేలు జ‌ర‌గుతుంద‌ని మార్కెట్(Market) వ‌ర్గాలు చెబుతున్నాయి.

  • Share this:
    ప్ర‌ముఖ డిజిటల్ పేమెంట్‌లో గూగుల్‌పే(Google Pay) వినియోగ‌దారులకు కొత్త పెట్టుబ‌డి అవ‌కాశం అందించింది. గూగుల్ పే ప్లాట్ ఫాంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్(Deposit) చేసుకొనే వెసులుబాటు క‌ల్పిస్తోంది. దీంతో ఖాతాదారులు చేతి వేలితో పొదుపు చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. దీని ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని గూగుల్‌పే చెబుతుంది. వినియోదారుల‌కు పొదుపు చ‌ర్య‌ల కార‌ణంగా మేలు జ‌ర‌గుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అస‌లు ఎలా ఫిక్స్‌డ్ డిపాజిట్(Fixed Deposit) చేయాలో తెలుసుకొందాం.
    ఈ డిజిట‌ల్ ఎఫ్‌డీ(Digital FD) స్కీమ్ వినియోగ‌దారుల‌కు అంద‌జేసేందుకు గూగుల్‌పే ఈక్విటాస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాస్స్ (Equitas small finance bank)  బ్యాంక్ ఈ స్కీంకు ఫైనాస్సియ‌ల్ పార్ట‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్కీం అండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే న‌ని గూగుల్‌పే తెలిపింది. త్వ‌ర‌లో iOS వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలిపింది.
    ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే విధానం..
    step1: మీ Android ఫోన్ లో Google Pay యాప్‌ని ఓపెన్ చేయాలి. అక్క‌డ బిజినెస్ బిల్ (Business and Bills) కింద స్క్రోల్ చేయాలి.
    Step2: అక్క‌డ ఈ క్విటాస్ బ్యాంక్ స్పాట్ వ‌ద్ద ఈక్విటాస్ SFB లోగోపై క్లిక్ చేయాలి.
    Step3: ఇప్పుడు, మీరు FD లో డిపాజిట్ చేయాల‌నుకొంటే ఎంత మొత్తం చేయ‌ద‌ల్చుకొన్నారో ఎంచుకొని.. అనంత‌రం ఎంత కాలం డిపాజిట్ చేయాల‌నుకొంటున్నారో న‌మోదు చేయాలి.
    Step4: అనంత‌రం మీ కేవైసీ (KYC) వివరాలు.. ఆధార్ నంబర్, పాన్మ, క్విటాస్ బ్యాంక్ స్పాట్‌కు అందించాలి. అంతే మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పూర్త‌వుతుంది.

    Airtel Offers: ఎయిర్‌టెల్‌లో 2జీబీ కాంప్లిమెంట‌రీ డెటా.. ఎలా పొందాలో తెలుసా




    అనంత‌రం మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ పూర్త‌యి త‌ర్వాత అస‌లు పెట్టుబ‌డి, వ‌డ్డీ క‌లిపి నేరుగా మీ గూగుల్‌పేకి లింక్ చేసిన బ్యాంక్ ఎకౌంట్‌లోకి వ‌చ్చి చేరుతాయి. ఇందులో ఎప్ప‌టిక‌ప్పుడు మీ ఖాత‌ను త‌నిఖీ చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా మీరు ముంద‌గానే డిపాజిట్‌ను ఉప‌సంహ‌రించుకోవాలంటే కూడా ఆ అవ‌కాశ‌న్ని గూగుల్ పే అందిస్తోంది. మీరు మెచ్యూరిటీకి ముందే డిపాజిట్ ఉప‌సంహ‌రించుకొంటే అదే రోజు మీ ఖాతాలోకి డ‌బ్బులు వ‌చ్చి చేరుతాయి.
    ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్‌లకు ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షలు వరకు గ్యారంటీ ఉంది. ఒక సంవత్సరం ఎఫ్‌డీ కోసం 6.35 శాతం వరకు వడ్డీ ని అందిస్తోంది. ప్ర‌స్తుతం బ‌య‌ట అందిస్తున్న అన్ని ర‌కాల వ‌డ్డీతో పోలిస్తే ఈ పొదుపుఖాతా ఎక్కువ‌గా వ‌డ్డీ అందిస్తోంది. ఈ ఫిక్స‌డ్ డిపాజిట్ కోసం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్ర‌త్యేకంగా ఖాతా తెర‌వాల్సిన అవ‌స‌రం లేకుండా మీ గూగుల్‌పే ద్వారానే ఈ లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు.
    Published by:Sharath Chandra
    First published: