భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయాయి. యూపీఐతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకునే సౌలభ్యం ఉండటంతో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యూపీఐ రాకతో బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన బాధలు తప్పాయి. మరి ఇంతటి సౌలభ్యాన్ని తెచ్చిన యూపీఐ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? యూపీఐ అందిస్తున్న యాప్స్ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం. యూపీఐ దీన్నే సంక్షిప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది ఆర్‌బిఐ నియంత్రిత సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) చేత తక్షణ నగదు బదిలీ కోసం అభివృద్ధి చేయబడింది. యూపీఐ IMPS ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పనిచేస్తుంది. అయినప్పటికీ, దీని ద్వారా ఐఎంపీఎస్‌ను మించి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఏవైనా రెండు బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీ చేయడానికి యూపీఐ మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఒకే మొబైల్ అప్లికేషన్ ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ చేసుకోవడానికి యూపీఐ సహకరిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్‌ఫామ్స్‌లోనూ పనిచేస్తుంది. మీరు కూడా యూపీఐ వినియోగదారులైతే తప్పకుండా ఈ 5 అంశాలపై అవగాహన పెంచుకోండి.
1. యూపీఐ నగదు బదిలీకి బ్యాంక్ ఖాతా అవసరమా?
యూపీఐ అకౌంట్ క్రియేట్ చేయాలంటే కచ్చితంగా ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ఉండాలి. యూపీఐని కార్డు లేదా వాలెట్‌తో లింక్ చేయలేము.
2. యూపీఐతో నగదు బదిలీకి ఉన్న ఛానెల్స్?
వర్చువల్ ఐడి/ బ్యాంక్ అకౌంట్ నెంబర్ + ఐఎఫ్ఎస్సీ/ ఆధార్ సంఖ్య.. ఈ మూడు ఛానెల్స్ ద్వారా యూపీఐ నగదు పంపించవచ్చు లేదా స్వీకరించవచ్చు.
3. భారత్‌లో యూపీఐ సౌకర్యాన్ని అందిస్తున్న 10 అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్ ఏవి?
ఫోన్‌పే, పేటీఎం, భీమ్, మోబిక్విక్, గూగుల్ పే, ఉబెర్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎస్బీఐ పే, యాక్సిస్ పే, బాబ్ యూపీఐ
4. యూపీఐ, IMPS మధ్య తేడా ఏంటి?
IMPSతో పోలిస్తే యూపీఐ చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దాం.
a. పీర్ టు పీర్ ఫంక్షనాలిటీ అందిస్తుంది.
b. వ్యాపారి చెల్లింపులను సులభతరం చేస్తుంది.
c. ఒకే యాప్‌తో వేగంగా నగదు బదిలీ చేయవచ్చు.
d. ఒకే క్లిక్‌తో నగదు బదిలీ పూర్తవుతుంది.
5. యూపీఐ ఉపయోగించి రోజుకు ఎంత మొత్తం నగదు బదిలీ చేయవచ్చు?
ప్రస్తుతం, ఒక రోజులో రూ.1లక్ష వరకు యూపీఐతో మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.