భారతదేశంలో 5G నెట్‌వర్క్ ఇంకా లాంచ్ కాలేదు. ఇటీవలే 5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటికే 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లను ఆయా కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేశాయి. వన్‌ప్లస్, రెడ్‌మీ, షియోమి, రియల్‌మీ, శామ్‌సంగ్ వంటి అనేక బ్రాండ్‌లు మార్కెట్లో 5G-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొత్త ఫ్యాషన్, కొత్త ఫీచర్‌లు, టెక్నాలజీని అందించే సరికొత్త 5G ఫోన్‌ను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా చాలా మంది ప్రస్తుతం 5G ఫోన్ కొనాలా? 4G ఫోన్ ఉంటే సరిపోతుందా? అని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన 5 ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఏవో చూద్దాం.
5G స్మార్ట్‌ఫోన్‌లతో ఉపయోగం ఏంటి?
5G స్మార్ట్‌ఫోన్ కొత్త క్వాల్‌కమ్ లేదా మీడియాటెక్ ఇంటర్నల్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ రెండు చిప్‌సెట్ తయారీదారులు ఇంటర్నల్ 5G మోడెమ్‌లతో మొబైల్ పరికరాల కోసం కొత్త SoCలను ప్రారంభించారు. కాబట్టి ఫోన్ తయారీదారులు చిప్‌సెట్‌లను కొనుగోలు చేసినప్పుడు, ఇంకా మార్కెట్‌లోకి వెళ్లని టెక్నాలజీ కోసం ప్రీమియం ధర చెల్లించాల్సి ఉంటుంది. 5G ఫోన్‌లను కొనుగోలు చేసేవారి నుంచి బ్రాండ్‌లు ప్రీమియం ధర వసూలు చేస్తాయి. ప్రస్తుతం రూ.15,000లోపు 5G ఫోన్‌ను సులభంగా పొందగలిగినప్పటికీ, అదే ధరలో 4G ఫోన్‌తో పోల్చినప్పుడు, ఫీచర్‌లలో చాలా వ్యత్సాసం కనిపిస్తుంది.
5G మాత్రమే కాకుండా ఇతర ఫీచర్‌ల కోసం ఫోన్‌ను కొనాలా?
భారతదేశంలో 5G నెట్‌వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చే ఆరు నెలల్లో లేదా ఆ తర్వాత అందుబాటులోకి రావచ్చు. అందుకే 2022లో 5G ఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే, 5G నెట్‌వర్క్ సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా ఇతర ఫీచర్‌లను కూడా పరిశీలించాలి. కెమెరా, డిస్‌ప్లే నాణ్యత, ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ వంటి ఫీచర్‌లపై దృష్టి పెట్టాలి. 5G ఫోన్‌తో పోలిస్తే ఈ విభాగాలన్నింటిలో 4G ఫోన్ మీకు మెరుగ్గా కనిపిస్తుంది.
భవిష్యత్తు కోసం 5G ఫోన్
దేశంలో డేటా వేగం ఎంత వేగంగా ఉండబోతోందో ఎవరికీ తెలియనప్పటికీ, చాలా బ్రాండ్‌లు కొనుగోలుదారులకు 5G ఫోన్‌లను పరిచయం చేశాయి. భవిష్యత్తు అవసరాలను కేంద్రంగా చేసుకునే 5G ఫోన్‌లను మార్కెట్ చేశారు. ప్రస్తుతం 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఫోన్ 5జీ కంటే ఎక్కువ నెట్‌వర్క్ బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుందని గమనించాలి. మరొక ఫోన్‌కి అప్‌గ్రేడ్ కావడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనీసం రాబోయే 2-3 సంవత్సరాలలో 5G నెట్‌వర్క్‌లు పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది.
భారతదేశంలో 5G లాంచ్ 4G ముగింపును సూచిస్తుందా?
నిజానికి 4G నెట్‌వర్క్‌లు ఉంటాయి. అలాగే ప్రస్తుత 4G స్మార్ట్‌ఫోన్ కూడా అలాగే ఉంటుంది. 5G నెట్‌వర్క్ లాంచ్ క్రమంగా ఉంటుంది. కనీసం కొన్ని సంవత్సరాల పాటు 4G సేవలు కొనసాగుతాయి. కాబట్టి ప్రస్తుతం 4G ఫోన్‌ని కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని సంవత్సరాలపాటు వినియోగించవచ్చు.
ఫోన్లను 5Gకి అప్‌గ్రేడ్ చేయాలా లేదా 4Gని కొనసాగించాలా?
5G ఫోన్‌లకు వాటి సొంత ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పుడు అవి ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ 4G ఫోన్‌లు అదే స్థాయిలో సమర్థమైనవి, విశ్వసనీయమైనవి. 4G ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల వచ్చే 2 సంవత్సరాలలో అది నిరుపయోగంగా మారదని గుర్తించాలి. రూ.25,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి 5జీ ఫోన్ కొనుగోలు చేయడం మంచిదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 4G, 5G, 5g mobile, 5g smart phone