Five Planets : ఆకాశంలో పంచ గ్రహ కూటమి... కళ్లారా చూడొచ్చు... ఇలా చెయ్యండి...

Five Planets in a Week : 2020 సంవత్సరంలో ఆకాశంలో చాలా అద్భుతాల్ని చూస్తున్నాం. ఇప్పుడు మరొకటి చూడొచ్చు. అదే ఐదు గ్రహాల కూటమి.

news18-telugu
Updated: July 20, 2020, 8:02 AM IST
Five Planets : ఆకాశంలో పంచ గ్రహ కూటమి... కళ్లారా చూడొచ్చు... ఇలా చెయ్యండి...
Five Planets : ఆకాశంలో పంచ గ్రహ కూటమి... కళ్లారా చూడొచ్చు... ఇలా చెయ్యండి... (credit - twitter)
  • Share this:
Five Planets in a Week : మన భూమి నవ గ్రహాల్లో ఒకటని మనకు తెలుసు. సైంటిస్టులు ఆ మధ్య... నవ గ్రహాల్లో ఒకటైన ప్లూటోను... మరుగుజ్జు గ్రహంగా తేల్చేసి... మొత్తం గ్రహాలు 8 మాత్రమే అన్నారు. సర్లే అని సరిపెట్టుకున్నాం. ఆ 8 గ్రహాల్లో రెండు, మూడు ఎప్పుడూ ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ... అవి గ్రహాలని మనలో చాలా మందికి తెలియదు. దానికి తోడు అవి నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయి. అందువల్ల అవి కూడా స్టార్సే అనుకుంటారు చాలా మంది. తాజాగా సైంటిస్టులు ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఈ వారంలో ఆకాశంలో ఐదు గ్రహాలు కనిపిస్తాయని తెలిపారు. వాటిని మామూలు కళ్లతోనే చూడొచ్చంటున్నారు.


ఐదు గ్రహాలు ఒకేసారి చూడగలగడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే... అలా అవి వచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఖగోళ శాస్త్రవేత్త బీజీ సిద్ధార్థ ప్రకారం... ప్రపంచంలోని అన్ని దేశాలూ... ఐదు గ్రహాల్ని ఆకాశంలో చూడగలవట. రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నుంచి తెల్లారే సూర్యోదయం లోపు... ఐదు గ్రహాలు కనిపిస్తాయంటున్నారు.

ఇంతకీ ఆ గ్రహాలు ఏవంటే... మెర్క్యురీ (బుధగ్రహం), వీనస్ (శుక్రగ్రహం), మార్స్ (అంగారక గ్రహం), జూపిటర్ (గురుగ్రహం), శాట్రన్ (శనిగ్రహం).


వీటిలో జూపిటర్‌, శనిగ్రహం పక్కపక్కనే ఉంటాయి. జూపిటల్ చాలా పెద్దగా మెరుస్తూ ఉంటుంది. ఈ గ్రహాలకు ఎడమవైపు కాస్త దూరంలో ఎరుపు నారింజ రంగులో మెరుస్తూ అంగారక గ్రహం ఉంటుంది. ఈ మూడూ రాత్రివేళ ఆకాశంలో కనిపిస్తాయి.


వీటికి తోడు... శుక్రగ్రహం అత్యంత కాంతివంతంగా మెరుస్తూ... చాలా పెద్ద సైజులో ఉంటుంది. బుధగ్రహం చాలా చిన్నగా, ఎక్కువ కాంతి లేకుండా ఉంటుంది. ఇక యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని కూడా చూడాలంటే... పవర్‌ఫుల్ టెలిస్కోప్ ఉండాలి.


ఏది ఏమైనా అరుదైన అవకాశాన్ని వదులుకోవద్దనీ... మన సౌరవ్యవస్థలో గ్రహాల్ని కళ్లారా చూడమని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 20, 2020, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading