Internet Speed: డేటా స్పీడ్‌ను గుర్తించే 5 అద్భుతమైన ఆండ్రాయిడ్​ యాప్స్​.. క్షణాల్లో ఇలా చెక్​ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

వివిధ సంస్థలు తక్కువ ధరకే హైస్పీడ్​ ఇంటర్నెట్​ అందిస్తామంటూ యూజర్లను ఆకర్షిస్తున్నాయి. వాస్తవానికి అవి ఇచ్చే ప్రకటనలకు, వచ్చే ఇంటర్నెట్​కు పొంతన ఉండదు. అందుకే అసలు మీ ఇంటర్నెట్​ స్పీడ్​ ఎంత ఉందో చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనేక యాప్స్​ అందుబాటులోకి వచ్చాయి.

  • Share this:
నేటి టెక్నాలజీ(Technology) యుగంలో ప్రతిదీ ఇంటర్నెట్​తో ముడిపడి ఉంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఇంటర్నెట్​ వినియోగం మరింత పెరిగింది. ఓవైపు ఆన్​లైన్​ క్లాసులు మరోవైపు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కారణంగా దాదాపు ప్రతి ఇంట్లో బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​ లేదా మొబైల్ డేటా అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు తక్కువ ధరకే హైస్పీడ్​ ఇంటర్నెట్​ అందిస్తామంటూ యూజర్లను ఆకర్షిస్తున్నాయి. వాస్తవానికి అవి ఇచ్చే ప్రకటనలకు, వచ్చే ఇంటర్నెట్​కు పొంతన ఉండదు. అందుకే అసలు మీ ఇంటర్నెట్​ స్పీడ్​ ఎంత ఉందో చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనేక యాప్స్​ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా సులభంగా మీ నెట్ కనెక్షన్‌ ఇంటర్నెట్​ స్పీడ్‌ అంచనా వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని చెక్​ చేసుకునేందుకు ఉపయోగపడే ఆండ్రాయిడ్ యాప్స్​ను పరిశీలిద్దాం.

Viral Photos: విచిత్రమైన ఫొటోలు.. మీరు చూస్తే కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు..


ఓక్లా స్పీడ్‌టెస్ట్
ఇంటర్నెట్​ స్పీడ్​ టెస్ట్​ చేసుకుందుకు ఎక్కువ మంది ఉపయోగించే యాప్​ ఓక్లా. ఈ యాప్​ ఆండ్రాయిడ్​తో పాటు యాపిల్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంది. ఓక్లా స్పీడ్​ టెస్ట్​తో అసలు ఇంటర్నెట్ వేగాన్ని తెలుసుకోవచ్చు. అయితే దీని కోసం మీ లొకేషన్​ యాక్సెస్, ఇతర అనుమతులు​ ఇవ్వాల్సి ఉంటుంది. డెస్క్‌టాప్ బ్రౌజర్ వెర్షన్‌లో సైతం ఓక్లాను ఉపయోగించవచ్చు.

స్పీడ్‌టెస్ట్ మాస్టర్
ఇది మీ ఆండ్రాయిడ్ డివైజెస్​లో మీ ఇంటర్నెట్ స్పీడ్​ను పరీక్షించడానికి ఉపయోగించే పాపులర్​ యాప్. దీని హోమ్‌పేజీ డిస్‌ప్లేలో డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్​ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి ద్వారా సులభంగా ఇంటర్నెట్​ స్పీడ్​ చెక్​ చేసుకోవచ్చు. దీని ద్వారా 4G, 5G, DSL, ADSL ఇంటర్నెట్​ స్పీడ్​ను పరీక్షించవచ్చు. స్పీడ్‌టెస్ట్ మాస్టర్ "వై-ఫై ఎనలైజర్" గా కూడా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

మెటియర్
మెటియర్​ యాప్​తో 3G, 4G LTE లేదా 5G నెట్‌వర్క్ కనెక్షన్‌ గల ఇంటర్నెట్ స్పీడ్​ను అంచనా వేయవచ్చు. దీంట్లో ఎటువంటి యాడ్స్​ ఉండవు. ఈ యాప్‌ని ఉపయోగించి, కేవలం ఇంటర్నెట్​ స్పీడ్​ మాత్రమే కాకుండా, యాప్స్​ ఎంత వేగంగా పనిచేస్తాయో కూడా చెక్​ చేసుకోవచ్చు.

Guinness World Record: నిజంగా ఇది అద్భుతమే.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు.. ఎలా సాధ్యం అంటే..


ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ మీటర్
ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ మీటర్ యాప్​ ద్వారా మీ ఇంటర్నెట్​ వేగాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. ఈ యాప్ కలర్స్​ ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉంటుంది. ఈ యాప్​ ద్వారా డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్​ను చెక్​ చేసుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా డార్క్, లైట్ మోడ్స్​ మధ్య మారవచ్చు. ఇది మెటియర్​ యాప్​ను పోలి ఉంటుంది. అయితే, తక్కువ స్టోరేజ్, ర్యామ్ కాన్ఫిగరేషన్లు ఉన్న వినియోగదారులు 3 ఎంబీ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న స్పీడ్‌టెస్ట్ మాస్టర్ లైట్‌ను కూడా ఉపయోగించవచ్చు.

గూగుల్ స్పీడ్ టెస్ట్
గూగుల్​ స్పీడ్​ టెస్ట్ యాప్​, బ్రౌజర్​ రెండు రూపాల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ యాప్ డౌన్‌లోడ్ చేయకూడదనుకుంటే, స్మార్ట్‌ఫోన్‌లోని క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్ స్పీడ్ టెస్ట్‌ అని సెర్చ్ చేసి మీ ఇంటర్నెట్​ వేగాన్ని చెక్​ చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లు అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్​ అలాగే కనెక్షన్ టైమ్​ను సైతం చెక్​ చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published: