పబ్‌జీ గేమ్ ఆడితే పిచ్చెక్కింది... జమ్మూలో ఆస్పత్రిపాలైన ఫిట్‌నెస్ ట్రైనర్

పేషెంట్ పరిస్థితి ఏమీ బాగా లేదని, మానసిక స్థితి పూర్తిగా అదుపు తప్పిందని డాక్టర్లు తేల్చేశారు. స్నేహితులు, బంధువుల్ని గుర్తుపడుతున్నా అతని మానసిక స్థితిపై పబ్‌జీ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు డాక్టర్లు.

news18-telugu
Updated: January 10, 2019, 11:50 AM IST
పబ్‌జీ గేమ్ ఆడితే పిచ్చెక్కింది... జమ్మూలో ఆస్పత్రిపాలైన ఫిట్‌నెస్ ట్రైనర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పబ్‌జీ మొబైల్... ఇటీవల యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న గేమ్. గతేడాది ట్రెండింగ్‌లో టాప్‌గా నిలిచిన గేమ్ ఇదే. ఇప్పుడు కూడా పబ్‌జీకి యువత బానిసైపోయింది. బస్సుల్లో, రైళ్లల్లో, రోడ్డు మీద, ప్లాట్‌ఫామ్‌పై ఎక్కడ పడితే అక్కడ కుర్రాళ్లు పబ్‌జీ ఆడుతూ మొబైల్‌కు అతుక్కుపోతున్నారు. చివరకు పబ్‌జీ గేమ్ ఓ అడిక్షన్‌లా మారిపోయింది. ఎంతలా అంటే... జమ్మూలో ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ పబ్‌జీ అడిక్షన్‌తో పిచ్చివాడైపోయాడు. చివరకు ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. తను వరుసగా పది రోజుల పాటు పబ్‌జీ ఆడినట్టు తెలుస్తోంది. ఒక రౌండ్ పూర్తి చేయగానే తనను తాను గాయపర్చుకుంటూ, పిచ్చిపిచ్చిగా అరుస్తుంటే ఇంట్లోవాళ్లంతా కంగారుపడ్డారు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే పబ్‌జీ మొబైల్ గేమ్‌కు అడిక్ట్ కావడం వల్ల చివరికి ఇలా పిచ్చిపట్టినట్టు తేలింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

జమ్మూలో ఇదే తొలి ఘటన కాదు. ఇలాంటివి ఆరు ఘటనలు జరిగాయి. పేషెంట్ పరిస్థితి ఏమీ బాగా లేదని, మానసిక స్థితి పూర్తిగా అదుపు తప్పిందని డాక్టర్లు తేల్చేశారు. స్నేహితులు, బంధువుల్ని గుర్తుపడుతున్నా అతని మానసిక స్థితిపై పబ్‌జీ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు డాక్టర్లు. పబ్‌జీ ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు వ్యసనమని, ఈ గేమ్ అడిక్షన్‌లా మారితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఉదాహరణగా నిలిచింది ఈ ఘటన. ఇలా ప్రాణాలకు ముప్పుగా మారిన గేమ్స్‌ని రాష్ట్రంలో, దేశంలో నిషేధించాలంటూ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను స్థానికులు కోరారు.

పబ్‌జీ... మిలిటరీ స్టైల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్. ఇందులో 100 మంది ప్లేయర్స్‌ని యుద్ధక్షేత్రంలో వదిలేస్తారు. అందులో అందరూ అందరితో యుద్ధం చేస్తుంటారు. చివరకు ఎవరు మిగుల్తారో వాళ్లే విజేత. ప్రస్తుతం పబ్‌జీ గేమ్ పీసీ, ఎక్స్‌బాక్స్ వన్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో అందుబాటులో ఉంది. పబ్‌జీ మొబైల్‌కు ఇండియాలో బాగా క్రేజ్ పెరుగుతోంది. ఈ గేమ్‌కు అనేకమంది అడిక్ట్ అవుతున్నారు. ఇటీవల వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... తమ కాలేజీ, హాస్టల్ ఆవరణలో పబ్‌జీ మొబైల్ ఆడకూడదంటూ నిషేధం విధించింది. అంతేకాదు గతేడాది డిసెంబర్‌లో చైనాలో ఆన్‌లైన్ గేమింగ్ ఎథిక్స్ రివ్యూ కమిటీ 20 గేమ్స్‌ని సమీక్షించింది. అందులో తొమ్మిది గేమ్స్ ప్రమాదకమైనవిగా గుర్తించింది. వాటిలో పబ్‌జీ, ఫోర్ట్‌నైట్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండిFake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?

ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్... రెండు వడ్డీల మధ్య తేడాలేంటీ?
Published by: Santhosh Kumar S
First published: January 10, 2019, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading