ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి, ఫ్యాషన్ ఫాలోయర్ల మొదటి ఎంపిక HONOR Band 5i

HONOR Band 5i | రిమోట్ కెమెరా ఫంక్షన్‌కు మద్దతు ఇవ్వడం అనేక ఫీచర్లు HONOR Band 5iలో ఉన్నాయి, అంటే మీ ఈ బ్యాండ్‌ని మీరు మీ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్‌కు కనెక్ట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా రిమోట్ ఇంటర్‌ఫేస్ అవుతుంది. మీరు స్మార్ట్‌ఫోన్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ని కూడా కంట్రోల్ చేయవచ్చు.

news18-telugu
Updated: January 28, 2020, 5:54 PM IST
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి, ఫ్యాషన్ ఫాలోయర్ల మొదటి ఎంపిక HONOR Band 5i
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి, ఫ్యాషన్ ఫాలోయర్ల మొదటి ఎంపిక HONOR Band 5i
  • Share this:
కొత్త సంవత్సరంలో, ప్రతిఒక్కరూ వారి న్యూ ఇయర్ రిజల్యూషన్‌గా ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేయడం సాధారణమే, అయితే సరైన సాయం లేకుండా, దీనిని సాకారం చేయడం చాలా కష్టం. మీరు ఎన్ని క్యాలరీలు కరిగించారనే విషయాన్ని ట్రాక్ చేయగలిగితే, దానిని ఫాలో అవ్వడం చాలా తేలిక అవుతుంది. అందువల్ల, మీరు మీ ఫిట్‌నెస్ రొటీన్‌ని ట్రాక్ చేయడానికి ఫిట్‌నెస్ బడ్డీ కొరకు చూస్తున్నట్లయితే, అప్పుడు, మా వద్ద గొప్ప పరిష్కారం ఉంది. ఇటీవల లాంఛ్ చేయబడ్డ HONOR Band 5i పూర్తి ఫిట్‌నెస్ ట్రాకర్‌‌తోపాటుగా మీ ఫ్యాషన్ అభిరుచిని కూడా తీరుస్తుంది. ఇది మాత్రమే కాదు, టెక్నాలజీపరంగా ఇతర బ్రాండ్‌లను సైతం అధిగమిస్తుంది.

డిజైన్ మరియు కలర్ డిస్‌ప్లే:HONOR Band 5i, 160 x 80 HD రిజల్యూషన్‌తో 2.4cm కలర్ ఫుల్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. స్ట్రాప్ గురించి ఆలోచించినట్లయితే, ఈ బ్యాండ్ సిలికాన్ రబ్బర్ స్ట్రాప్‌తో వస్తుంది. దీనిలో ఛార్జింగ్ కొరకు బిల్ట్ ఇన్ USB కనెక్టర్ ఉంది, అందువల్ల దీనిని మీ ల్యాప్‌టాప్‌కు ఫ్లగ్ ఇన్ చేయడం ద్వారా ఈ బ్యాండ్‌ని చాలా తేలికగా ఛార్జ్ చేయవచ్చు, ఇంకా ఈ ఛార్జింగ్ వారం రోజులపాటు ఉంటుంది. ఛార్జింగ్‌కు సంబంధించిన మీ ఆందోళనలు పక్కన పెట్టి, మీరు మీ ఫిట్‌నెస్ రొటీన్‌పై దృష్టిని కేంద్రీకరించవచ్చు. ఇది మాత్రమే కాదు, HONOR కొత్త వాచ్ ఫేస్ స్టోర్ నుంచి, మీరు సందర్భం లేదా ట్రెండ్ అవుతున్న డిజైన్‌ ప్రకారంగా మీ స్టైల్‌ని మీరు ఎంచుకోవచ్చు. ఈ అవకాశాన్ని కోల్పోకుండా, ఈ ఫిట్‌నెస్ బ్రాండ్‌ని సొంతం చేసుకోండి మరియు మీ స్టైల్‌ని పెంపొందించుకోండి.

ఖచ్చితమైన ఫిట్‌నెస్ ట్రాకర్:


ఫిట్‌నెస్ రొటీన్‌ని ఫాలో కావడానికి అత్యంత ముఖ్యమైన అంశం ఖచ్చితమైన ఫిట్‌నెస్ ట్రాకింగ్. HONOR Band 5i TruSeen 3.0 టెక్నాలజీ రోజంతా కూడా మీ గుండె కొట్టుకునే రేటును ఖచ్చితంగా మానిటర్ చేస్తుంది. అంటే మీ గుండె కొట్టుకునే రేటును దృష్టిలో పెట్టుకొని, మీరు మీ వర్క్‌అవుట్ టైమ్‌ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీనితోపాటుగా, దీనిలో ఉండే TrueSleep2.0 టెక్నాలజీ మీ నిద్రను విశ్లేషించి 6 సాధారణ నిద్ర సమస్యలను గుర్తిస్తుంది, మీ నిద్రను మెరుగుపరుచుకోవడానికి మీకు 200లకు పైగా కస్టమైజ్డ్ చిట్కాలను అందిస్తుంది. దీనితోపాటుగా, Honor Band 5iపై అప్‌డేట్ చేయబడ్డ OTA SpO2 మానిటర్‌ని కంట్రోల్ చేస్తుంది. Honor Band 5i ఫిట్‌నెస్ ట్రాకర్‌లో SpO2  అప్‌డేట్ ఫిబ్రవరి చివరివారం నాటికి లభిస్తుంది. ఇది మీ రక్తనాళాల్లోని ఆక్సిజన్ సాచ్యురేషన్ స్థాయిని ట్రాక్ చేస్తుంది, తద్వారా బాడీ వర్క్ అవుట్‌లు లేదా ఎత్తైన ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో ఆ పరిస్థితులను మీ శరీరం ఏవిధంగా స్వీకరిస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు.

HONOR Band 5i, HONOR Band 5i features, HONOR Band 5i review, HONOR Band 5i specifications, HONOR Band 5i specs, హానర్ బ్యాండ్ 5ఐ, హానర్ బ్యాండ్ 5ఐ ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5ఐ రివ్యూ, హానర్ బ్యాండ్ 5ఐ స్పెసిఫికేషన్స్
HONOR Band 5i

మీ స్వంత వ్యక్తిగత పర్సనల్ ట్రైనర్:

ఫిట్‌నెట్ రొటీన్ పాటించేటప్పుడు అనేక ఇన్‌డోర్ మరియు అవుట్‌డోర్ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో, ప్రతి కార్యకలాపానికి ఒకే పరిష్కారం లభిస్తుంటే, దానిని మించి ఇంకా ఏమి కావాలి? HONOR Band 5i సాయంతో, మీరు గుండెకొట్టుకునే రేటును మానిటరింగ్ చేయడం, వర్క్‌అవుట్ టైమ్, దూరం, స్ట్రైడ్ ఫ్రీక్వెన్సీ, క్యాలరీలు మరియు ఇంకా ఏరోబిక్స్ వంటి హై లెవల్ ఫిట్‌నెస్ ట్రాకింగ్‌లను చేయవచ్చు. ఈ బ్యాండ్ ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే ఇది 50 మీటర్‌ల వరకు వాటర్ రిసిస్టెన్స్‌ని అందించడమే కాకుండా, దీనిలో ఇండోర్ రన్నింగ్, అవుట్‌డోర్ రన్నింగ్, నడవడం మరియు సైక్లింగ్ వంటి 9 ఇన్‌బిల్ట్ ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి. ఇది వ్యక్తిగత ట్రైనర్ కాదంటారా?

స్మార్ట్ ఫీచర్లు:


రిమోట్ కెమెరా ఫంక్షన్‌కు మద్దతు ఇవ్వడం అనేక ఫీచర్లు HONOR Band 5iలో ఉన్నాయి, అంటే మీ ఈ బ్యాండ్‌ని మీరు మీ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్‌కు కనెక్ట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా రిమోట్ ఇంటర్‌ఫేస్ అవుతుంది. మీరు స్మార్ట్‌ఫోన్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ని కూడా కంట్రోల్ చేయవచ్చు.

అలానే, మీకు కాల్ వచ్చినప్పుడు, ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటే, అప్పుడు పాకెట్ నుంచి మీ ఫోన్‌ని బయటకు తీయాల్సిన అవసరం లేదు. అవును, కాలర్‌ని గుర్తించడానికి, మీరు మీ మణికట్టును పైకి ఎత్తితే సరిపోతుంది. ఒక తెలియని నెంబరు నుంచి మీరు కాల్‌ని అందుకున్నట్లయితే, లేదా మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నట్లయితే, ఈ బ్యాండ్ ద్వారా కాల్‌ని కట్ చేయవచ్చు. ఈ బ్యాండ్‌పై మీరు మీ మెసేజ్‌లను కూడా చూడవచ్చు. అన్నింటిని మించి, మీ ఫోన్ ఎక్కడ ఉందో మీరు తెలుసుకోలేకపోతే, అప్పుడు ఫోన్ ఫైండర్ ఫంక్షన్ మీ ఫోన్‌ని వెంటనే కనుగొంటుంది.

ధర:


నల్లటి రంగులో ఉండే HONOR Band 5i కేవలం రూ. 1,990లకు లభ్యమవుతుంది. Amazon ప్రైమ్ మెంబర్‌లు ఈ బ్యాండ్‌ని జనవరి 18 12:00 PM నుంచి మరియు ఇతర కస్టమర్‌లు జనవరి 19 నుంచి ఆర్డర్ చేయవచ్చు. అందువల్ల, ఇప్పుడే మీ ఆర్డర్ కార్ట్‌ని మరియు ఫిట్‌నెస్ రొటీన్‌ని సిద్ధం చేసుకోండి మరియు కొత్త సంవత్సరం ఫిట్‌నెస్ గోల్స్‌ని త్వరలో సెట్ చేసుకోండి.

(This is a partnered post.)
Published by: Santhosh Kumar S
First published: January 20, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading