Snoring App: ఇది గురక స్థాయిని తెలిపే సరికొత్త యాప్.. ఎలా పనిచేస్తుందంటే..

Fitbit Charge 4---1

నిద్రలో గురక పెట్టడం సాధారణంగా మనలో చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా ఎంతసేపు గురక పెడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? త్వరలో దీన్ని గుర్తించే యాప్ ఒకటి అందుబాటులోకి రానుంది.

  • Share this:
నిద్రలో గురక పెట్టడం సాధారణంగా మనలో చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా ఎంతసేపు గురక పెడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? త్వరలో దీన్ని గుర్తించే యాప్ ఒకటి అందుబాటులోకి రానుంది. గూగుల్ అధీనంలో ఉన్న ఫిట్ బిట్ ట్రాకర్ దీనికి సంబంధించిన యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం డెమో వర్షన్ లో ఉన్న ఈ యాప్ ద్వారా నిద్రలో ఎంత సేపు గురక పెడుతున్నారో, ఎలాంటి శబ్దాలు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. 'స్నోర్ అండ్ డిటెక్ట్' గా పిలిచే ఈ యాప్‌ను 9టూ5 గూగుల్ ద్వారా ఫిట్ బిట్ రూపొందించింది. ఫిట్ బిట్ డివైజ్ లో మైక్రోఫోన్ ను చొప్పించడం ద్వారా శబ్ధాలను ఇది గ్రహిస్తుంది. ఇందులో గురక, ఇతర నిద్ర సంబంధిత ధ్వనులు తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్ ఇంకా అందుబాటులో రాలేదు.

గురక స్థాయి అంచనా..
ఫిట్ బిట్ ట్రాకర్స్ 2017 నుంచి నిద్రకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది. నిద్రలో హృదయ స్పందనలను తెలియజేస్తుంది. గురకను అంచనా వేసే ఈ తాజా ఫీచర్ ద్వారా గురక ఎప్పుడు పెడుతున్నామో ట్రాక్ చేస్తుంది. ధ్వని తీవ్రత, బేస్ లైన్ సౌండ్ స్థాయిలను నిర్ణయించి, విశ్లేషించడానికి ఈ యాప్ అనుమతిస్తుంది. దీని అల్గారిథం బేస్ లైన్ సౌండ్ స్థాయి కంటే బిగ్గరగా ఉన్న శబ్దాలను గుర్తించి అది గురక లేదా మరేదైనా శబ్దమా అనేది గణిస్తుంది. శబ్దం స్థాయి గురక కంటే ఎక్కువగా ఉంటే ఈ ఫీచర్ దాన్ని అంచనా వేయదు.

మూడు రకాలుగా..
ఎవరు గురక పెడుతున్నారనే విషయాన్ని ఫిట్ బిట్ గుర్తించదు. కాబట్టి గురక పెట్టే వారు రాత్రి పూట చేసే శబ్దాలను గ్రహించి వాటిని శాతాల రూపంలో చూపిస్తుంది. ఇది మీరు రాత్రి ఎంతసేపు గురకలో గడిపారో సూచిస్తుంది. 'నోన్ టూ మైల్డ్' అంటే మొత్తం నిద్రలో 10 శాతం కన్నా తక్కువ సేపు గురకపెట్టారని తెలుపుతుంది. 10 శాతం కంటే ఎక్కువ గురకపెడితే 'మోడరేట్' అని కనీసం 40 శాతం కంటే ఎక్కువ సమయం ఉంటే 'ఫ్రీక్వెంట్' అని సూచిస్తుంది.

ఈ ఫీచర్ గురకతో పాటు వినియోగదారులో పడకగదిలో పెద్ద శబ్దాలను కూడా గుర్తిస్తుంది. 'వెరీ క్వైట్ నుంచి వెరీ లౌడ్' వరకు స్కేలుపై శబ్ద తీవ్రతను సూచిస్తుంది. ఈ ఏపీకే కోడ్ ఫిట్ బిట్స్ బ్యాటరీ లైఫ్ పై ఆధారపడి ఉంటుంది. నిద్రపోయే ముందు వినియోగదారులు కనీసం 40 శాతం ఛార్జ్ చేయాలని ఈ అప్లికేషన్ సిఫార్సు చేస్తుంది.
Published by:Krishna Adithya
First published: