సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదటి మొబైల్ కాల్... మాట్లాడింది వీళ్లే

First Mobile Call in India | భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ ఎప్పుడు మాట్లాడారో తెలుసా? సరిగ్గా 25 ఏళ్ల క్రితం. మాట్లాడింది ఎవరో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 31, 2020, 3:43 PM IST
సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదటి మొబైల్ కాల్... మాట్లాడింది వీళ్లే
సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదటి మొబైల్ కాల్... మాట్లాడింది వీళ్లే
  • Share this:
సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 1995 జూలై 31న భారతదేశంలో మొదటి మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు. అప్పటి కేంద్ర టెలికాం మంత్రి సుఖ్ రామ్, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు మొదటిసారిగా మొబైల్ ఫోన్‌లో మాట్లాడారు. కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌లో ఉన్న జ్యోతి బసుతో న్యూ ఢిల్లీలోని సంచార్ భవన్‌లో ఉన్న సుఖ్ రామ్ తొలి మొబైల్ కాల్ మాట్లాడారు. మోడీ టెల్‌స్ట్రా మొబైల్ నెట్ సర్వీస్ ద్వారా తొలి కాల్ వెళ్లింది. భారతదేశంలో టెలీకమ్యూనికేషన్స్ సేవలు 1995లో ప్రారంభమయ్యాయి. అప్పుడే కోల్‌కతాలో మొబైల్ నెట్ సర్వీస్ ప్రారంభమైంది. భారతదేశంలో మోడీ గ్రూప్, ఆస్ట్రేలియా టెలికామ్ దిగ్గజం టెల్‌స్ట్రా జాయింట్ వెంచర్ మోడీ టెల్‌స్ట్రా భారతదేశంలో టెలికాం సేవల్ని ప్రారంభించడం విశేషం. ఈ కంపెనీ నెట్వర్క్ ద్వారా సుఖ్ రామ్, జ్యోతి బసు తొలి మొబైల్ కాల్ మాట్లాడారు.

Gionee: బీ రెడీ... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Alert: ఈ 29 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి

అప్పుడు భారతదేశంలో సెల్యులార్ సేవల్ని అందించేందుకు 8 కంపెనీలకు లైసెన్స్ లభిస్తే అందులో మోడీ టెల్‌స్ట్రా కంపెనీ ఒకటి. భారతదేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో రెండు లైసెన్సుల చొప్పున ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇది జరిగి 25 ఏళ్లవుతోంది. ఆ తర్వాత భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవం చూశాం. అప్పట్లో మొబైల్ ఫోన్ ఉండటం ఓ లగ్జరీ. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఓ అవసరంగా మారిపోయింది. 2020 మార్చి 31 నాటికి భారతదేశంలో 98.91 కోట్ల యాక్టీవ్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ 25 ఏళ్లలో 2జీ, 3జీ నెట్వర్క్ దాటి ప్రస్తుతం 4జీ యుగంలో ఉన్నాం. త్వరలో 5జీ సేవల్ని చూడబోతున్నాం.
Published by: Santhosh Kumar S
First published: July 31, 2020, 8:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading