హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone: రూ.52 లక్షలు పలికిన ఐఫోన్‌.. దాని స్పెషల్‌ ఏంటంటే?

iPhone: రూ.52 లక్షలు పలికిన ఐఫోన్‌.. దాని స్పెషల్‌ ఏంటంటే?

iPhone: రూ.52 లక్షలు పలికిన ఐఫోన్‌.. దాని స్పెషల్‌ ఏంటంటే?

iPhone: రూ.52 లక్షలు పలికిన ఐఫోన్‌.. దాని స్పెషల్‌ ఏంటంటే?

యూఎస్‌లో యాపిల్‌ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్‌ జనరేషన్‌కు చెందిన ఐఫోన్‌ వేలం నిర్వహించారు. దాని అసలు ధర కంటే దాదాపు వంద రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందంటే ఆశ్చర్యపోక తప్పదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

సాధారణంగా పురాతన వస్తువులను, ప్రముఖులు వినియోగించిన వస్తువులను వేలం వేస్తుంటారు. అలాంటి వస్తువు మరొకటి దొరొకే అవకాశం లేదు కాబట్టి, దాని వెనుక గొప్ప చరిత్ర ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ (Gold) అనే మాటను నిజం చేస్తూ ఆయా కంపెనీలు మొదటిసారిగా తయారు చేసిన మోడల్స్‌కు కూడా వేలంలో భారీ ధర తక్కుతుంది. తాజాగా యూఎస్‌లో యాపిల్‌ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్‌ జనరేషన్‌కు చెందిన ఐఫోన్‌ (iPhone) వేలం నిర్వహించారు. దాని అసలు ధర కంటే దాదాపు వంద రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందంటే ఆశ్చర్యపోక తప్పదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొదటి నుంచీ మార్కెట్లో ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. యాపిల్‌ కంపెనీ ప్రతి సిరీస్‌లో కొత్త ఫీచర్స్, అప్‌డేట్స్‌ అందిస్తుంది. మార్కెట్‌లోకి రాకముందే ముందస్తు బుకింగ్‌లో దాదాపు సేల్స్‌ పూర్తవుతాయంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజం ఈ ఫోన్స్‌కి ఉన్న డిమాండ్‌ అలాంటిది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఫస్ట్‌ జనరేషన్‌కి చెందిన ఓ ఐఫోన్‌ను ఇటీవల వేలం వేశారు. అది రూ.52 లక్షలు రికార్డు ధర పలికింది.

2007లో యాపిల్‌ కంపెనీ ఈ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పటి వరకు ఈ స్మార్ట్ ఫోన్ సీల్ తీయకపోవడం విశేషం. 2007లో దీని ధర 599 డాలర్లు (సుమారు రూ.48,000). దీని బిడ్డింగ్ 2,500 డాలర్ల(రూ.2.06 లక్షలు)తో ప్రారంభించగా ఎవరూ ఊహించనంతగా 63,356 డాలర్లు (సుమారు రూ.53 లక్షలు)కు అమ్ముడుపోవడం విశేషం. ఈ వేలం యూఎస్ కు చెందిన LCG Auctions వెబ్‌సైట్‌లో జరిగింది. యూఎస్ లోని ప్రధాన ఆక్షన్స్‌ హౌస్ లలో ఇది కూడా ఒకటి.

రూ.10 వేల 4 బర్నర్స్ ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ రూ.1,900కే.. సూపర్ డూపర్ ఆఫర్!

ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ లో 3.5-అంగుళాల డిస్‌ప్లేతో 2-మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ప్రస్తుత ఐఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లే, 48-మెగా పిక్సెల్ కెమెరాతో ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఫస్ట్‌ జనరేషన్‌ ఐఫోన్‌ స్టోరేజ్ కెపాసిటీ 8 జీబీ మాత్రమే. ఇప్పటి ఐఫోన్ వినియోగిస్తున్న వాళ్లు మొదటితరం ఐఫోన్‌కి చెందిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యానికి గురవుతారు.

రూ.19,990 స్మార్ట్‌టీవీ రూ.7 వేలకే.. మూడేళ్లు వారంటీ!

యూఎస్‌కు చెందిన కాస్మోటిక్ టాటూ ఆర్టిస్ట్ కరెన్ గ్రీన్ కు 2007లో తన స్నేహితుడు ఈ ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. అది కూడా తనకు కొత్తగా జాబ్ వచ్చిన సందర్భంగా ప్రజెంట్ చేశాడు. అప్పటి నుంచి గ్రీన్ దీన్ని ఓపెన్ చేయకుండా సీల్డ్ బాక్స్ లోనే భద్రంగా దాచారు. ఇప్పుడు ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని తన బిజినెస్‌కు ఉపయోగిస్తానని కరెన్ గ్రీన్ అంటున్నాడు. ఇలా ఉండగా గతంలోనూ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌ను వేలం వేయగా రూ.32 లక్షలు పలికింది. ఇప్పుడు మరింత ఎక్కువ ధర పలకడం విశేషం.

First published:

Tags: Apple iphone, Apple store, Iphone, Smartphone

ఉత్తమ కథలు